Begin typing your search above and press return to search.
5 భాషల్లో రీమేక్ కానున్న సౌత్ మూవీ?
By: Tupaki Desk | 8 Sep 2015 9:49 AM GMTకొన్నేళ్ల క్రితం రిలీజైన మళయాళ మూవీ దృశ్యం.. తెలుగు సహా అనేక భాషల్లోకి రీమేక్ అయింది. ఒరిజినల్ తో పోల్చితే... రీమేక్ లు అన్నిటిలో స్టార్స్ ఇష్టపడి మరీ చేసిన మూవీ ఇది. ఇఫ్పుడు మరో సౌత్ సినిమా ఈ ఫీట్ సాధించబోతోంది. జయం రవి, అరవింద్ స్వామి నటించి, మోహన్ రాజా డైరెక్షన్ లో వచ్చిన తని ఒరువి... ఇప్పుడు తమిళ్ లో బ్లాక్ బస్టర్. ఈ మూవీ కాన్సెప్ట్, తీసిన విధానం దేశం మొత్తాన్ని ఆకట్టుకుంటోంది.
దీంతో ఈ తమిళ సినిమాని... రీమేక్ చేసేందుకు అన్ని భాషల నుంచి ప్రయత్నాలు మొదలైపోయాయి. తెలుగు - కన్నడ - హిందీ - మరాఠీ - బెంగాలీ భాషల నుంచి ఎంక్వైరీలు వస్తున్నాయి. తెలుగులో అయితే.. ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ తో కానీ... మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కానీ తనే తీసేందుకు దర్శకుడు మోహన్ రాజా సిద్ధం అవుతున్నాడు. ఇప్పటికే వీళ్లతో మాట్లాడానని... త్వరలో కాస్టింగ్ డీటైల్స్ వెల్లడిస్తానని చెప్పాడు.
తని ఒరువుని.. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ చేస్తే బాగుంటుందనే టాక్ ఉంది. సల్లూ భాయ్ చూడకపోయినా.. ఆయన టీం ఇప్పటికే ఈ మూవీపై ఓ కన్నేసి ఉంచారట. రెండ్రోజుల్లో డెసిషన్ చెబ్తామంటున్నారు సల్మాన్ టీం. కన్నడలో రీమేక్ చేసేందుకు పునీర్ రాజ్ కుమార్ ఇంట్రెస్ట్ చూపిస్తుండగా... మరాఠీ వెర్షన్ రైట్స్ కోసం... జెనీలియా ట్రై చేస్తోందట. హిందీ తెలుగు వెర్షన్ లను తానే తీయాలనుకంటున్నాడు ఒరిజినల్ తీసిన దర్శకుడు మోహన్ రాజా. అవకాశమిస్తే మాత్రం.. ప్రూవ్ చేసుకునేందుకు రెడీ అంటున్నాడు.