Begin typing your search above and press return to search.
‘యమలీల’ తర్వాతి ఇదే అంటున్నాడు
By: Tupaki Desk | 5 Nov 2016 1:30 AM GMT‘నరుడా డోనరుడా’ తన కెరీర్లో చాలా కీలకమైన సినిమా అంటున్నాడు సీనియర్ నటుడు తనికెళ్ల భరణి. ఈ సినిమాకు తనే హీరో అన్న సుమంత్ మాటల్ని గుర్తు చేసుకుంటూ.. అలా కాకపోయినా ఈ సినిమాలో సగం బాధ్యత తాను తీసుకున్నట్లు ఆయన చెప్పారు. ‘‘యమలీల సినిమాలో హీరోతో సమానంగా ఉండే క్యారెక్టర్ చేశాను. ఆ తర్వాత ‘కనక మహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్’ సినిమాలో కూడా అలాంటి క్యారెక్టరే చేసాను. మళ్లీ చాలా కాలం తర్వాత ‘నరుడా డోనరుడా’ సినిమాకు సగం బాధ్యత తీసుకున్నాను. ఈ సినిమా తర్వాత నాకు ఇంకో నాలుగైదు మంచి క్యారెక్టర్లు చేసే అవకాశం వస్తుంది. నా స్ధాయిని మరింత పెంచే సినిమా అవుతుంది. అందుకనే ఈ చిత్రాన్ని నా సెకండ్ ఇన్నింగ్స్ గా భావిస్తున్నాను’’ అని భరణి చెప్పారు.
తాను పాత్ర నిడివి ఎంత అన్నదాని కంటే దాని ప్రాధాన్యం ఎంత అన్నదాన్ని బట్టే సినిమాలు చేస్తుంటానని భరణి అన్నారు. ‘‘నాకు ఒకే ఒక్క సీన్ ఉన్న సినిమాలు కూడా చేస్తుంటాను. కాకపోతే ఆ సీన్ నచ్చాలి. ‘అతడు’ సినిమాలో నా మీద తక్కువ సన్నివేశాలుంటాయి. వాటిని నాలుగే రోజుల్లో షూట్ చేసేశారు. కానీ ఆ పాత్ర.. ఆ సన్నివేశాలు గుర్తుండిపోతాయి. ఆడు మగాడ్రా బుజ్జీ.. అనే డైలాగ్ ఎంతో పాపులరైంది. అదే డైలాగ్ తో ‘ఆడు మగాడ్రా బుజ్జి’ అనే సినిమా కూడా వచ్చింది. నేను ఎప్పట్నుంచో ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి ఒక్కోసారి తప్పని పరిస్థితుల్లో ఒక్క సీన్ అయినా చేయాల్సి వస్తుంటుంది. ఐతే ఒక్క సీనే అయినా మన మీద గౌరవంతో ఇచ్చారనుకుని.. ఆ ఒక్క సీన్లోనే మనమేంటో చూపించాలి అని ఛాలెంజ్ గా తీసుకుని చేస్తుంటాను’’ అని భరణి తెలిపారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/