Begin typing your search above and press return to search.
'థ్యాంక్యూ బ్రదర్' పుకార్లే నిజం అయ్యాయి
By: Tupaki Desk | 26 April 2021 12:01 PM ISTఅనసూయ ప్రధాన పాత్రలో నటించిన థ్యాంక్యూ బ్రదర్ టీజర్ మరియు ట్రైలర్ వచ్చినప్పటి నుండి సినిమాపై అంచనాలు ఆసక్తి పెరుగుతూ వచ్చింది. సినిమా చాలా ప్రత్యేకంగా ఉంటుందని మొదటి నుండి అనసూయ అండ్ టీమ్ చెబుతూ వస్తున్నారు. నిండు గర్బిణిగా అనసూయ ఈ సినిమాలో కనిపిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమా ను మొదట థియేటర్ ల్లో రిలీజ్ చేయాలనుకున్నారు. అందుకు తగ్గట్లుగానే ప్లాన్ చేశారు. కాని కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినిమా ను అనుకున్న సమయంకు విడుదల చేయలేక పోతున్నారు. సినిమా ను వాయిదా వేసి థియేటర్ లు పునః ప్రారంభం అయినప్పుడు విడుదల చేస్తారని అంతా భావించారు. కాని ఈ సినిమా ను ఓటీటీలో విడుదల చేసేందుకు చర్చలు జరుగుతున్నట్లుగా వార్తుల వచ్చాయి. వాటిని చాలా మంది పుకార్లు అనుకున్నారు.
థ్యాంక్యూ బ్రదర్ సినిమా ను ఓటీటీలో విడుదల చేస్తారనే వార్తలు పుకార్లని భావిస్తున్న సమయంలో అనూహ్యంగా మేకర్స్ ఆహాలో సినిమా ను నేరుగా స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. థియేటర్లు ఎప్పటికి పునః ప్రారంభం అయ్యేది తెలియడం లేదు. దాంతో పాటు పెద్ద సినిమాలు క్యూ కట్టి ఉన్నాయి. కనుక వాటితో పోటీ పడటం సాధ్యం అయ్యే విషయం కాదు. అందుకే థ్యాంక్యూ బ్రదర్ ను నేరుగా ఓటీటీలో విడుదల చేసేలా ప్లాన్ చేసినట్లుగా సమాచారం అందుతోంది.
థ్యాంక్యూ బ్రదర్ సినిమాను మే 7న ఆహా లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా పేర్కొన్నారు. అనసూయతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు ఇప్పటికే ప్రమోషన్ ను మొదలు పెట్టారు. జబర్దస్త్ లో సినిమా ప్రమోషన్ కు సంబంధించిన అనసూయ చిత్ర యూనిట్ సభ్యులతో సందడి చేసిన విషయం తెల్సిందే. థ్యాంక్యూ బ్రదర్ సినిమా లో కొత్త అనసూయను చూస్తారని మేకర్స్ అంటున్నారు. అయితే అనసూయ అభిమానులు మాత్రం వెండి తెరపై థ్యాంక్యూ బ్రదర్ ను చూడాలనుకుంటే ఆహా లో స్ట్రీమింగ్ చేయాల్సి వచ్చినందుకు బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి పుకార్లను నిజం చేస్తూ థ్యాంక్యూ బ్రదర్ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ కాబోతుంది.