Begin typing your search above and press return to search.
థాంక్యూ పోస్ట్‌మార్టం... మంగళం శ్రీను ని లేపేయకుండాల్సింది!
By: Tupaki Desk | 24 July 2022 7:32 AM GMTనాగ చైతన్య.. విక్రమ్ కుమార్ ల కాంబినేషన్ లో వచ్చిన థాంక్యూ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. దాంతో ఓపెనింగ్ కలెక్షన్స్ మరీ తక్కువగా ఉన్నాయని ట్రేడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. బ్రేక్ ఈవెన్ కు చాలా దూరాన సినిమా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు ట్రేడ్ వర్గాల వారు చర్చించుకుంటున్నారట.
ఈ సమయంలో సినిమా కు ఇలాంటి టాక్ రావడం కు.. ఇంత తక్కువ వసూళ్లు రావడంకు కారణం ఏంటీ అంటూ పోస్ట్ మార్టం నిర్వహిస్తూ ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. యూట్యూబ్ ల్లో థాంక్యూ సినిమా పోస్ట్ మార్టం ను రచ్చ రచ్చ గా చేస్తున్నారు.
ఈ సమయంలో కొంత మంది నోటీస్ చేసిన విషయం ఏంటంటే సినిమా లో సునీల్ పాత్ర చాలా కీలకంగా.. ఎంటర్ టైన్మెంట్ అందించేదిగా ఉండేదట. ఆ పాత్ర ను పూర్తిగా లేపేశారని తెలుస్తోంది. సినిమా ఎడిటింగ్ టేబుల్ మీదకు వెళ్లినప్పుడు దాదాపుగా పది నిమిషాలు తక్కువ మూడు గంటల నిడివి ఉండేనట. ఎడిటర్ దాదాపుగా రెండున్నర గంటలకు అటు ఇటుగా చేయడం.. దాన్ని నిర్మాత దిల్ రాజు మరింత ట్రిమ్ చేయడం జరిగిందని గుసగుసలాడుకుంటున్నారు.
అంటే సుందరానికి సినిమా మూడు గంటలు ఉండటం వల్ల ఫలితం తారుమారు అయ్యింది. అందుకే ఈ సినిమా ను రెండు గంటలకు కాస్త ఎక్కువ మాత్రమే ఉండాలని దిల్ రాజు అనుకున్నాడట. అందుకే అవసరం లేదు అనుకున్న సునీల్ పాత్ర ను పూర్తిగా తొలగించారట. సినిమా లో సునీల్ పాత్ర ఉండి ఉంటే తప్పకుండా ఎంటర్ టైన్మెంట్ ఉండేది అనేది టాక్.
థాంక్యూ రొటీన్ గా.. మూస స్క్రీన్ ప్లేతో సాగింది. ఈమద్య కాలంలో మంచి పాపులారిటీని దక్కించుకున్న సునీల్ కనుక ఈ సినిమాలో ఉండి ఉంటే ఫలితం లో ఏమైనా మార్పు ఉండేదేమో అనేది కొందరి అభిప్రాయం. పుష్ప సినిమా లో మంగళం శీను పాత్ర ను చేసిన సునీల్ ఏ స్థాయిలో ఆకట్టుకున్నాడో అందరికి తెల్సిందే. అందుకే థాంక్యూ లో మంగళం శ్రీను ఉంటే ఫలితం మరోలా ఉండేదేమో.