Begin typing your search above and press return to search.
20 రోజులకే 'థాంక్యూ' ఓటీటీ స్ట్రీమింగ్.. ఇక్కడ 50 రోజుల నిబంధన వర్తించదా..?
By: Tupaki Desk | 10 Aug 2022 4:50 AM GMTఅక్కినేని నాగచైతన్య హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ''థాంక్యూ'' సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం చవిచూసిన సంగతి తెలిసిందే. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందిన ఈ చిత్రం నిర్మాత దిల్ రాజుకు భారీ నష్టాలను మిగిల్చింది. థియేటర్లలో నిరాశ పరిచిన ఈ మూవీ.. ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయింది.
''థాంక్యూ'' సినిమా డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్న అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ.. ఆగస్టు 11న స్ట్రీమింగ్చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా ఇచ్చారు. అంటే జులై 22న థియేట్రికల్ రిలీజ్ అయిన సినిమా సరిగ్గా 20 రోజులకే డిజిటల్ వేదిక మీదకు రాబోతోంది.
థియేటర్లలో సినిమా చూడని జనాలు ఇప్పుడు త్వరగానే ఓటీటీలో చూసే అవకాశం దక్కుతుంది. ఇక్కడి దాకా అంతా బాగానే ఉంది కానీ.. ఓటీటీ కారణంగా థియేటర్ వ్యవస్థ మీదే ప్రభావం పడే ప్రమాదం ఉందంటూ తీసుకొచ్చిన 50 రోజుల డిజిటల్ స్ట్రీమింగ్ సంగతేంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇటీవల కాలంలో ప్రతీ సినిమా కూడా మూడు నాలుగు వారాలకే ఓటీటీలో ప్రత్యక్షమయ్యాయి. చిన్న మీడియం రేంజ్ చిత్రాల సంగతి పక్కన పెడితే.. పెద్ద సినిమాలు కూడా నెల తిరక్కుండానే డిజిటల్ స్ట్రీమింగ్ చేయబడ్డాయి. దీంతో జనాలు థియేటర్లకు రావడం తగ్గించేశారు. ఈ నేపథ్యంలో థియేటర్ వ్యవస్థను కాపాడుకోడానికి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
థియేట్రికల్ రిలీజైన 50 రోజుల తర్వాతే సినిమాలను ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. దిల్ రాజు సైతం ఇటీవల ‘బింబిసార’ సక్సెస్ మీట్ లో ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. 50 రోజుల తర్వాతే ఓటీటీలో రిలీజ్ చేయాలని నిర్మాతలందరం నిర్ణయించిన నేపథ్యంలో.. ఈ సినిమాను కూడా అలాగే ఓటీటీకి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
దిల్ రాజు తాను డిస్ట్రిబ్యూట్ చేసిన సినిమా ఓటీటీ రిలీజ్ విషయంలో మాట్లాడిన మరుసటి రోజే 'థాంక్యూ' మూవీ మూడు వారాల్లోనే డిజిటల్ స్ట్రీమింగ్ కాబోతోందనే ప్రకటన వచ్చేసింది. దీంతో దిల్ రాజు రూల్స్ పెడతాడు కానీ.. పాటించడా? అని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
నిజానికి దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన 'ఎఫ్ 3' సినిమాని 50 రోజుల తర్వాతే ఓటీటీ స్ట్రీమింగ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోను ఎర్లీ స్ట్రీమింగ్ కాదని.. ముందుగా నిర్ణయించుకొన్న ప్రకారమే ఓటీటీలోకి తీసుకొస్తామని దిల్ రాజు విడుదలకు ముందే చెప్పారు. ఆ విధంగానే స్ట్రీమింగ్ చేసి మాట మీద నిలబడ్డాడు.
కానీ ఇప్పుడు ‘థాంక్యూ’ విషయంలో మాత్రం అగ్ర నిర్మాత ఆ రూల్ ను ఎలా బ్రేక్ చేశారో అర్థం కావడం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. బహుశా ఓటీటీ రిలీజ్ నిబంధనలు రాకముందే నాగచైతన్య చిత్రానికి సంబంధించిన డిజిటల్ డీల్ సెట్ అయ్యుండొచ్చని.. అందుకే ఈ రూల్ వర్తించదని కొందరు అభిప్రాయ పడుతున్నారు.
ఏదేమైనా ఇప్పుడిప్పుడే జనాలు మళ్లీ థియేటర్లకు తరలి వస్తున్న తరుణంలో ఇలా ఎర్లీ స్ట్రీమింగ్ చేయడం మంచిది కాదని అంటున్నారు. మరి థియేట్రికల్ సిస్టమ్ ని కాపాడుకోడానికి రాబోయే రోజుల్లోనైనా స్ట్రిక్ట్ గా రూల్స్ పాటిస్తారేమో చూడాలి.