Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ మ‌ర్చిపోయారా.. కావాల‌నే పంచ్ వేశారా?

By:  Tupaki Desk   |   24 March 2022 11:54 AM GMT
ఎన్టీఆర్ మ‌ర్చిపోయారా.. కావాల‌నే పంచ్ వేశారా?
X
స్టార్ హీరో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ లో హ్యూమ‌ర్ చాలా ఎక్కువ‌. సెట్ లో తెగ అల్ల‌రి చేసే ఎన్టీఆర్ ఇటీవ‌ల తొలి ద‌శ ట్రిపుల్ ఆర్ ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్ ల‌లో రాజమౌళిని గిల్లుతూ ఆట‌ప‌ట్టించిన విష‌యం తెలిసిందే. అదే త‌ర‌హాలో రామ్ చ‌ర‌ణ్ ని కూడా ఆట‌ప‌ట్టించి న‌వ్వులు పూయించారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైర‌ల్ గా మారాయి కూడా. తాజాగా ఎన్టీఆర్ చేసిన ఓ ప‌ని మ‌రో సారి ఆయ‌నలోని కామెడీ సెన్స్ ని , టైమింగ్ ని తెలియ‌జేస్తోంది.

యావత్ దేశం మొత్తం ఇప్పుడు ట్రిపుల్ ఆర్ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాయి. ఈ గురువారం ఓవ‌ర్సీస్ లో ప్రీమియ‌ర్స్ మ‌రికొన్ని గంట‌ల్లో ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేప‌థ్యంలో ట్రిపుల్ ఆర్ టీమ్ వ‌రుస ప్ర‌మోష‌న్ ల‌తో సినిమాపై క్రేజ్ ని పెంచేస్తూనే వుంది. ఇంత వ‌ర‌కు నార్త్ ఇండియా మొత్తం చుట్టేసిన ట్రిపుల్ ఆర్ టీమ్ తాజాగా అంటే బుధ‌వారం నుంచి హైద‌రాబాద్ లో తెలుగు మీడియాకు ఇంట‌ర్వ్యూలు ఇవ్వ‌డం మొద‌లుపెట్టింది.

గ‌త కొన్ని రోజులుగా క్ష‌ణం తీసిర లేకుండా ఉత్త‌ర భాత‌రం మొత్తం చుట్టేసి వ‌చ్చిన రాజ‌మౌళి, రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ వార‌ణాసిలో ఫైన‌ల్ గా గంగా హార‌తికి హాజ‌రై ఉత్త‌రాది ప్ర‌మోష‌న‌ల్ టూర్ కు ముగింపు ప‌లికారు. తాజాగా తెలుగు మీడియాకు అవ‌కాశం ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా ఓ తెలుగు ఛాన‌ల్ కి రాజ‌మౌళి, రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ప్ర‌త్యేకంగా ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. యాంక‌ఱ్ అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు చెప్పారు.

రామ్ చ‌ర‌ణ్ తో మీరు క‌లిసి ఓ హై వోల్టేజ్ యాక్ష‌న్ సీన్ చేయ‌డం, ఇద్ద‌రు కొట్టుకోవ‌డం మీకు ఎలాంటి ఛాలెంజ్ గా అనిపించింద‌ని యాంక‌ర్ ఇంగ్లీష్ లో ప్ర‌శ్నించింది. తెలుగు యాంక‌ర్ ఇంగ్లీష్ లో ప్ర‌శ్నించ‌డం ఏంట‌ని ఎన్టీఆర్ అనుకున్నాడో లేక ఇక్క‌డ కూడా ఇంగ్లీష్ గోలేంటి బాబూ అనుకున్నాడో ఏమోగానీ మొత్తానికి హిందీలో స‌మాధానం చెప్ప‌డం మొద‌లుపెట్టాడు. దీంతో ఒక్క‌సారిగా రాజ‌మౌళి, రామ్ చ‌ర‌ణ్ తో పాటు ప్ర‌శ్నించిన యాంక‌ర్ కూడా షాక్ అయింది.

ఇదేంటీ హిందీ మాట్లాడుతున్నారు అని యాంక‌ర్ అన‌గానే వెంట‌నే రాజ‌మౌళి అందుకుని నార్త్ ఇండియా అయిపోయింది.. సౌత్ .. ఇది హైద‌రాబాద్ అని గుర్తు చేశారు. వెంట‌నే మాఫ్ క‌ర్ అని ఎన్టీఆర్ మ‌ళ్లీ హిందీలోనే మాట్లాడే ప్ర‌య‌త్నం చేయ‌డంతో తెలుగు.. తెలుగు అంటూ రాజ‌మౌళి మ‌రీ నొక్కి చెప్ప‌డం.. ఎన్టీఆర్ న‌వ్వుతుంటే ... ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ క‌ళ్ల‌తోనే సెటైరిక‌ల్ గా సైగ చేసుకోవ‌డం న‌వ్వులు పూయించింది. ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్ ల చూపుల‌ని బ‌ట్టి ఇది తెలుగు ఛాన‌ల్ అని, తెలుగులో మాట్లాడుకుందామ‌ని యాంక‌ర్ కు నేరుగా సెటైర్ వేసిన‌ట్టుగా స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఎన్టీఆర్ స్పాంటెనియ‌స్ పంచ్ కి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారింది.