Begin typing your search above and press return to search.
అమితాబ్ వ్యాఖ్యలకు తనుశ్రీ హర్ట్..!
By: Tupaki Desk | 1 Oct 2018 11:47 AM GMTమనకి రోజుకొక హాట్ టాపిక్ ఉంటుంది. అలానే ముంబై వాళ్ళకు కూడా ఒక హాట్ టాపిక్ ఉంటుంది.. కాకపొతే గత వారం రోజులుగా వాళ్ళకు ఒకటే టాపిక్. తనుశ్రీ దత్తా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నానా పటేకర్ తనను 2008 లో ఒక షూటింగ్ సందర్భంగా లైంగికంగా వేధించాడని.. ఆ తర్వాత తనపై దాడి కూడా చేయించాడని కూడా ఆరోపించింది. ఇక ఆ దాడికి సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
ఇదిలా ఉంటే తనుశ్రీ దత్తాకు సపోర్ట్ గా కొంతమంది బాలీవుడ్ సెలబ్రిటీలు సపోర్ట్ గా నిలిస్తే...మరి కొందరు మాత్రం నానాను సమర్థించారు. కానీ ఈమధ్య 'థగ్స్ ఆఫ్ హిందుస్తాన్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ను రిపోర్టర్స్ తనుశ్రీ వ్యవహారం పై ప్రశ్నించగా 'నేను తనుశ్రీ ని కాను.. నానా పటేకర్ ను అంతకన్నా కాను నేనెలా వాటిగురించి సమాధానం ఇవ్వగలను' అని జవాబిచ్చాడు.
అమితాబ్ కామెంట్ గురించి తనుశ్రీ దగ్గర ప్రస్తావించగా "నేను హర్ట్ అయ్యాను ఎందుకంటే వీళ్ళే సోషల్ ఇష్యూస్ పై సినిమాలు చేసేది. కానీ వీళ్ళ ముందు ఏదైనా విషయం జరిగినప్పుడు.. ఎవరికోసం అయినా నిలబడాల్సి వచ్చినప్పుడు వీళ్ళు ఇలాంటి అర్థం పర్థం లేని స్టేట్మెంట్స్ ఇస్తుంటారు" అని ఫైర్ అయింది. ఇదిలా ఉంటే.. "అటెన్షన్ కోసం - పబ్లిసిటీ కోసం - బిగ్ బాస్ ఎంట్రీ తనుశ్రీ ఇలాంటి హంగామా చేస్తోంది" అని విమర్శించే వారికి.. "నేనొక మిస్ యూనివర్స్.. 16-18 బాలీవుడ్ సినిమాల్లో నటించాను.. నా కోరికలు మరీ అంత చీప్ గా ఉంటాయా?" అని గట్టిగా జవాబిచ్చింది.