Begin typing your search above and press return to search.
థప్పడ్ ట్రైలర్.. అబ్బనీ తియ్యని దెబ్బ కాదు!
By: Tupaki Desk | 2 Feb 2020 7:16 AM GMTచెంపదెబ్బలకు తెలుగువారికి అవినాభావ సంబంధం.. మన దర్శకులు చెంపదెబ్బలను భలే గ్లామరైజ్ చేస్తారు. చిరు కోపంతో శ్రీదేవిని ఒకటి పీకితే.. ఆమెలో రొమాన్స్ పొంగుతుంది.. 'అబ్బని తియ్యనిదెబ్బ' అనే సూపర్ హిట్ పాట అయిపొయింది. ఇక 'అర్జున్ రెడ్డి' డైరెక్టర్ సందీప్ వంగా అయితే స్వేచ్చగా ఒకరినొకరు నాలుగు పీక్కోలేని లవర్స్ అసలు లవర్సే కాదు..వారిది లవ్వు కాదు పాడూ కాదు అన్నట్టుగా ఒక సందేశం ఇచ్చారు. ఇక రివర్స్ లో హీరోయిన్ చేత చెంపదెబ్బలు కొట్టించుకుని 'మహాభాగ్యం' హీరోలు అనుకునే సీన్లు కూడా మన సినిమాల్లో కోకొల్లలు. మనం ఓస్ ఇంతేనా అని పూచికపుల్లలా తీసిపారేసే చెంపదెబ్బను కాన్సెప్ట్ గా తీసుకుని హిందీలో ఒక సినిమా తెరకెక్కింది. ఆ సినిమానే థప్పడ్. తాప్సీ ఈ సినిమాలో హీరోయిన్. అనుభవ సిన్హా దర్శకుడు.
ఈ సినిమా ట్రైలర్ ఈమధ్యే రిలీజ్ అయింది.. ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ట్రైలర్ లో చూపించిన సినిమా కాన్సెప్ట్ ను క్లుప్తంగా చెప్పుకుంటే.. తాప్సీ ఒక వివాహిత. భర్త.. అత్తమమాలతో కలిసి జీవించే సగటు భారతీయ మహిళ. జీవితం అంతా సాఫీగా సాగుతున్న సమయంలో ఇంట్లో ఒక పార్టీ జరుగుతుంది.. బంధుమిత్రులు అందరూ హాజరవుతారు. అక్కడ ఏదో ఒక చిన్న గొడవ.. ఆ గొడవలో తాప్సీ ఏదో మాట్లాడుతుంది.. భర్త కోపం నషాళానికి అంటుతుంది. అంతే తాప్సీని నలుగురి ముందు గట్టిగా చెంపదెబ్బ కొడతాడు.
తాప్సీ మనసు గాయపడుతుంది. విడాకులకు అప్లై చేస్తుంది. అడ్వొకేట్ ఎన్ని ప్రశ్నలు అడిగినా అవేవీ కారణాలు కావు అంటుంది. మరి ఎందుకు విడాకులు?.. అని అడిగితే "నన్ను మొదటిసారి చెంపదెబ్బకొట్టాడు. ఇక జీవితంలో నన్ను అలా కొట్టకూడదు. అందుకే డైవోర్స్ కావాలి" అంటుంది. ఓస్ అంతేనా. అంతే! అదే స్టోరీ.. ఇక ట్రైలర్ చూసేయండి.