Begin typing your search above and press return to search.

అమ్మో.. సురేష్‌ బాబు ఓకె అన్నాడా?

By:  Tupaki Desk   |   13 July 2017 6:51 AM GMT
అమ్మో.. సురేష్‌ బాబు ఓకె అన్నాడా?
X
అప్పుడెప్పుడో బిజినెస్ మ్యాన్ ఆడియో ఫంక్షన్లో పూరి జగన్ ఏం చెప్పాడంటే.. ఒక్కో హీరో ఒక్కో తరహాలో కథలను ఓకె చేస్తాడంటూ.. అందరి మీదనా కామెడీ చేశాడు. కాని ఇప్పుడు ఆ తంతు నిర్మాతలకు బాగా వర్తిస్తుంది. ఒక్కో నిర్మాత ఒక్కో తరహాలో కథలను ఓకే చేస్తారట. అయితే వీళ్ళందరిలోకి సీనియర్ ప్రొడ్యూసర్ సురేష్‌ బాబు చాలా స్పెషల్. ఆయన ఈ మధ్యన తమ్ముడితో రీమేక్ సినిమాలు తప్పించి.. అసలు ఒరిజినల్ కథలను తీస్తోందే లేదు.

అయితే ఇండస్ర్టీ టాక్ ఏంటంటే.. అసలు సురేష్‌ బాబుకు ఏదన్నా కథ చెబితే.. దానిని ఒప్పించుకోవడం చాలా కష్టం అంటుంటారు. ఆయనకు ఒక కథ చెప్పగానే అందులో చాలా మార్పులు సూచిస్తారట. వాటిని కరక్షన్ చేస్తే.. మళ్లీ కొత్తవి చెబుతారట. అదే కథపై పలువురు అభిప్రాయాలను తీసుకుని.. బాగా కన్ఫ్యూజ్ చేస్తాడట. అందుకే ఎక్కువమంది డైరక్టర్లు ఆయనకు కథ చెప్పడానికి భయపడతారట. కాని ఈ మధ్యనే సురేష్‌ బాబు డ్యాషింగ్ డైరక్టర్ తేజ చెప్పిన కథను ఓకే చేసి.. నేనే రాజు నేనే మంత్రి సినిమాను తీశాడు. ఇప్పుడు మరో కథను ఓకె చేశాడట.

పెళ్ళి చూపులు సినిమాతో లైమ్ లైట్ లోకి వచ్చిన డైరక్టర్ తరుణ్‌ భాస్కర్.. మొత్తానికి ఆరు నెలలు కష్టపడి ఒక కథను తయారు చేసి వినిపించిగా.. వెంటనే ఓకె అన్నాడట సురేష్‌ బాబు. పెళ్ళిచూపులు సినిమాకంటే ముందే ఈయనతో ఒక సినిమా చేయాల్సిన కమిట్మెంట్ ఉండటంతో.. ఆ డైరక్టర్ ఇప్పుడు సురేష్‌ ప్రొడక్షన్స్ లో తన రెండో సినిమాను చేస్తున్నాడు. అది సంగతి.