Begin typing your search above and press return to search.

యంగ్ డైరెక్ట‌ర్.. బిగ్ స్కెచ్!

By:  Tupaki Desk   |   7 Nov 2018 4:48 AM GMT
యంగ్ డైరెక్ట‌ర్.. బిగ్ స్కెచ్!
X
ఒకే ఒక్క సినిమా ఓవ‌ర్‌ నైట్ ఫేట్ మార్చేసింది. దేవ‌ర‌కొండ‌ను టాలీవుడ్ టాప్ హీరోగా ఎదిగేందుకు తొలి అడుగు ప‌డేలా చేస్తే... త‌రుణ్ భాస్క‌ర్‌ ని కెరీర్ ప‌రంగా తెలివైన అడుగులు వేసేందుకు ఆలంబ‌న‌గా నిలిచింది. అదే చిత్రంలో న‌టించిన క‌థానాయిక‌.. ప‌లువురు క‌మెడియ‌న్లు పెద్ద స్థాయిలో అవ‌కాశాలు అందుకుంటూ రంగుల ప్ర‌పంచంలో క‌ల‌ల్ని నిజం చేసుకుంటున్నారు. ఆ సినిమా ఏదో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌నేలేదు. `పెళ్లి చూపులు` గురించే ఇదంతా. తెర‌కెక్కించిన తొలి సినిమానే జాతీయ అవార్డ్ అందుకోవ‌డంతో యంగ్ డైరెక్ట‌ర్ త‌రుణ్ భాస్క‌ర్ క్రేజు అమాంతం పెరిగింది.

మొద‌టి ప్ర‌య‌త్నంతోనే ఔటాఫ్ ది బాక్స్ ఆలోచించే ద‌ర్శ‌కుడిగా ముద్ర ప‌డింది. కానీ ద్వితీయ ప్ర‌య‌త్నం మాత్రం ఎక్క‌డో దెబ్బ కొట్టింది. ఆ వెంట‌నే సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ‌లో చేసిన ప్ర‌య‌త్నం విఫ‌ల‌మైంది.పెళ్లి చూపులు త‌ర్వాత తెర‌కెక్కించిన `ఈ న‌గ‌రానికి ఏమైంది` ఊహించ‌ని రీతిలో ఫ్లాపైంది. అయితే సినిమా ఫ్లాపైనా.. డ‌బ్బులు వ‌చ్చేశాయని అప్ప‌ట్లో ప్ర‌చార‌మైంది.

ఆ సినిమా ఫ్లాప్ ప్ర‌భావం త‌రుణ్‌ పై ఏమాత్రం ప‌డ‌లేదు. ప్ర‌స్తుతం ఓ రెండు సినిమాల‌కు స‌న్నాహాలు చేస్తున్నాడు. ఇవి రెండూ సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌ లోనే ఉంటాయిట‌. ఒక‌టి ద‌ర్శ‌క‌త్వం వ‌హించేది.. వేరొక‌టి నిర్మాణ భాగ‌స్వామిగా ఉండేది. వీటిలో ఏ సినిమా హిట్ట‌యినా .. ఇదే తీరుగా అగ్ర బ్యాన‌ర్ల‌ను క‌లుపుకుంటూ కొత్త ప్ర‌యోగాలు చేసేందుకు త‌రుణ్ స‌న్నాహ‌కాల్లో ఉన్నాడ‌ని తెలుస్తోంది. మ‌రోవైపు వెబ్ సిరీస్‌ లు తెర‌కెక్కించే ఆలోచ‌న‌లోనూ అత‌డు ఉన్నాడ‌ట‌. అమెజాన్ - నెట్‌ ఫ్లిక్స్ వంటి సంస్థలు వెబ్ సిరీస్ ద‌ర్శ‌కులకు భారీగా ఆఫ‌ర్లు ఇస్తుండ‌డంతో ఆ కోణంలోనూ పెద్ద ఆలోచ‌న‌ల్లోనే ఉన్నాడ‌ని తెలుస్తోంది. ఇన్ని ప్ర‌ణాళిక‌ల్లో బిజీగా ఉన్నాడు కాబ‌ట్టి.. త‌ర‌ణ్ వెంట‌ప‌డితే చాలు ఆర్టిస్టుల‌కు అవ‌కాశాలు కుప్ప‌లుగా వ‌స్తాయ‌న‌డంలో సందేహం లేదు. అయితే త‌రుణ్ నిర్మాత‌గా షైన్ అవ్వాలంటే.. అతడి వెంట ఎన్నారై పెట్టుబ‌డులు ఉన్నాయా? అంటూ ఆస‌క్తిక‌ర చ‌ర్చా సాగుతోంది. మ‌రో కోణంలో చూస్తే అత‌డి రిలేష‌న్‌ షిప్స్ - ప్లానింగ్‌ ని మెచ్చుకుని తీరాల్సిందే. అత్యంత కీల‌క విభాగం అయిన ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప్రతిభ చూపాలే కానీ - ఇక్క‌డ అవ‌కాశాలకు కొద‌వే లేదు. స్థాయి భేదం ఉంటుందేమో కానీ - అవ‌కాశం లేక‌పోవ‌డం అన్న‌ది ఉండ‌దు. స‌రైన టైమింగుతో తెలివైన ప్ర‌ణాళిక‌ల‌తో త‌రుణ్ ముందుకెళ్ల‌డంపైనా ఫిలింవ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది.