Begin typing your search above and press return to search.
లవర్ బోయ్ రీఎంట్రీ వర్కవుటవుతుందా?
By: Tupaki Desk | 26 Sep 2015 5:47 AM GMTనువ్వే కావాలి సినిమాతో హీరోగా ఘనమైన ఎంట్రీ ఇచ్చాడు తరుణ్. ప్రారంభమే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి అటుపై వరుసగా క్లాసిక్ హిట్స్ అందుకున్నాడు. తరుణ్ ఇక సూపర్ స్టార్ కావడానికి ఇంకెంతో దూరం లేదు .. అనుకుంటున్న టైమ్ లో ఒక్కసారిగా కుదుపు. అతడి కెరీర్ అనూహ్యంగా గాడి తప్పింది. కొన్ని తప్పిదాలు అతడిని బాగా ఇబ్బంది పెట్టాయి. లవర్ బోయ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న తరుణ్ కెరీర్ కాలక్రమంలో జీరో అయింది.
2010 నుంచి 13 వరకూ సినిమాలే లేవంటే అర్థం చేసుకోవాలి. యుద్ధం - వేట వంటి సినిమాలతో చివరి సారిగా కనిపించాడు. ఈ గ్యాప్ లో తనకున్న బిజినెస్ ల్లో తలమునకలై పోయాడు. అయితే తాజాగా మళ్లీ మరో సినిమా ఛాన్స్ అందుకున్నాడు తరుణ్. ఇప్పటికే కన్నడ భాషలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోడానికి సిద్ధమయ్యాడు. ఈ లోపు అనూహ్యంగా ఓ కన్నడ సినిమా 'సింపుల్ ఆగి ఒందు లవ్ స్టొరీస్ తెలుగులో రీమేక్ చేయడానికి సిద్ధమయ్యాడు. నిన్ననే సినిమా మొదలైంది.
మొత్తానికి తరుణ్ రీమేక్ తో రీఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాలో మూడు పాత్రల్లో కనిపిస్తానని చెబుతున్నాడు. కథ సింపుల్ లవ్ స్టోరీ అని చిత్ర దర్శకులు బ్రదర్స్ గోపీ రమేష్ చెబుతున్నారు. ఎన్నేళ్లు ప్రేమించామన్నది కాదు.. ఎంత ప్రేమించామన్నదే ముఖ్యం.. అని చెబుతున్నారు. తరుణ్ బాడీ లాంగ్వేజ్ కు పక్కాగా యాప్ట్ అవుతుంది. అందువలనే తరుణ్ ఎంచుకున్నామంటూ నిర్మాతలు తెలిపారు. కథంతా ఒక్కరోజులో జరుగుతుంది. మధ్యలో ఫ్లాష్ బ్యాక్స్ వస్తాయి. అక్కడక్క రొమాంటిక్ యాంగిల్ ను కూడా టచ్ చేయబోతున్నామని దర్శకులు అంటున్నారు.
మొత్తానికి మళ్లీ ఏడాదిన్న తర్వాత తరుణ్ కొత్త సినిమా ప్రారంభమవ్వడం విశేషం. ఈ సినిమాతోనైనా హిట్ అందుకుని పూర్వ వైభవాన్ని తిరిగి తెచ్చుకుంటాడా? లేదా? అన్నది చూడాలి.