Begin typing your search above and press return to search.
లిరికల్ వీడియో: చరణ్ డాన్స్ అదిరిందయ్యా
By: Tupaki Desk | 17 Dec 2018 11:12 AM GMTరంగస్థలం లాంటి మెగా ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ తర్వాత చరణ్ నటించిన వినయ విధేయ రామ ప్రమోషన్ వేగం పెరిగింది. ఆ మధ్య ఫ్యామిలీ సాంగ్ ఒకటి విడుదల చేయగా రెస్పాన్స్ బాగానే వచ్చింది కానీ ఫ్యాన్స్ ఎదురు చూసిన నెంబర్ కాకపోవడంతో అంతగా కిక్ ఇవ్వలేకపోయింది. అది గుర్తించే రెండోది అన్ని మసాలాలు దట్టించి మరీ తస్సాదియ్యా అంటూ వదిలారు. శ్రీమణి సాహిత్యం అందించగా దేవి శ్రీ ప్రసాద్ అందించిన ట్యూన్ మాస్ తో పాటు అభిమానులకు ఇన్స్ టాన్ట్ గా కనెక్ట్ అయ్యేలా ఉంది. చాలా సింపుల్ గా అనిపించే ఇంగ్లీష్ పదాలతో శ్రీమణి ఆడుకోగా తనకు అలవాటైన హుషారైన బీట్ లో దేవి శ్రీ ప్రసాద్ చెలరేగిపోయాడు.
ట్యూన్ మరీ కొత్తగా ఫ్రెష్ గా అనిపించనప్పటికీ సబ్జెక్టు యాక్షన్ బేస్డ్ డ్రామా కాబట్టి ఇలాంటి పాటలైతేనే సరిగ్గా సూటవుతాయి. లైలా మజ్నులతో పోలికలు మొదలుపెట్టి ప్రేమికులు ఎలా ఉండకూడదో వివరిస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని హీరో హీరోయిన్లు ఒకరికి ఒకరు టీజ్ చేసుకుంటూ పాడటం బాగుంది. ఈ లిరికల్ వీడియోలో పాటతో ఇంకా వేరే ఆకర్షణలు కూడా ఉన్నాయి. సెట్స్ లో పాట షూట్ చేస్తుండగా చరణ్ వేసిన స్టెప్స్ ను బిట్స్ రూపంలో ఇందుల అక్కడక్కడా చూపించిన తీరు ఫ్యాన్స్ లో అంచనాలు పెంచేలా ఉంది. బుట్టబొమ్మలా కియారా అద్వానీ గ్లామర్ కొత్తగా అనిపిస్తున్న కాస్ట్యూమ్స్ చిరుని తలపిస్తున్న చరణ్ బాడీ లాంగ్వేజ్ ఉన్న హైప్ ని డబుల్ చేసేలా ఉన్నాయి.
అంతే కాదు ఈ పాట చిత్రీకరణ జరుగుతుండగా చిరంజీవి వచ్చి చూసి స్వయంగా సలహాలు ఇచ్చిన బిట్ కూడా ఇందులో పొందుపరచడంతో వినడానికే కాదు చూసేందుకు కూడా కలర్ ఫుల్ గా మారిపోయింది ఈ లిరికల్ వీడియో. జస్ప్రీత్ జాజ్-మానసి గాత్రం మంచి జోష్ ఇచ్చింది. ఇప్పటికే అంచనాలు హైలో ఉండగా వాటిని రెట్టింపు చేసేలా ఉన్న ఈ తస్సాదియ్యాతో మెగా ఫాన్స్ ఆనందం మాములుగా ఉండేలా లేదు