Begin typing your search above and press return to search.
ఆ 10 కోట్ల సంపాదన నాది.. అతడు ఇవ్వలేదంటున్న హీరోయిన్
By: Tupaki Desk | 25 Aug 2022 10:04 AM GMTదాదాపు 200 కోట్ల రూపాయల మోసం కేసులో ఆర్థిక నేరగాడు సుకేష్ చంద్రశేఖర్ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. అతడి ప్రియురాలిగా అతడితోపాటు కాజేసినట్టు ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నండేజ్ పై కూడా ఆరోపనలు వచ్చాయి. ఈ మేరకు అధికారులు ఈ కేసులో జాక్వెలిన్ ను విచారించారు. ఈడీ కేసులో విచారణలో భాగంగా గత ఏడాది ఏప్రిల్ లోనే జాక్వెలిన్ కు చెందిన రూ.7.27 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. వీటిల్లో 7 కోట్ల ఫిక్స్ డ్ డిపాజిట్లు ఉన్నాయి. ఈ డబ్బును తాను కష్టపడి సంపాదించానని.. అది సుకేష్ నేరాల నుంచి తనకు రాలేదని జాక్వెలిన్ అంటోంది.
రూ.200 కోట్ల సుకేష్ చంద్రశేఖర్ స్కాంలో బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ప్రమేయం ఉందని ఈడీ తేల్చింది. . పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడిన వ్యవహారంలో కరుడుగట్టిన నేరస్థుడు సుకేష్ చంద్రశేఖర్ తో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్టు ఈడీ విచారణలో వెల్లడైన సంగతి తెలిసిందే. ఈ కేసులో జాక్వలైన్ ఫెర్నాండేజ్ ఛార్జీ షీట్ దాఖలు చేశారు.
రాన్ బాక్సీ మాజీ ప్రమోటర్లు మల్విందర్ సింగ్, శివిందర్ సింగ్ లు జైళ్లో ఉన్న సమయంలో వారికి బెయిల్ ఇప్పిస్తానని చెప్పాడు చంద్రశేఖర్. కేంద్ర న్యాయ శాఖలోని ఉన్నతాధికారిగా వారి భార్యలను కలిసి బెయిల్ ఇప్పిస్తానని, అందుకు రూ. 200 కోట్ల ఖర్చవుతుందని చెప్పాడు. దీంతో చంద్రశేఖర్ ను నమ్మిన వారు రూ. 200 కోట్లు అప్పజెప్పారు. ఆ తరువాత వారికి సుకేశ్ కనిపించలేదు. ఈ డబ్బుతో చెన్నైలోని ఓ బంగ్లా ను కొన్నట్లు వారు పేర్కొన్నారు.
రూ.200 కోట్ల దోపిడీ కేసులో ఈడీ పోలీసులు విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ను విచారించారు. హిందీ సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు ఉన్న ఈ నటి చంద్రశేఖర్ చేతిలో మోసపోవడం గమనార్హం. పోలీసుల విచారణలో జాక్వెలిన్ పలు ఆసక్తి విషయాలను చెప్పింది. తిహార్ జైలు నుంచే కాలర్ ఐడీ స్పూపింగ్ ద్వారా జాక్వెలిన్ ను చంద్రశేఖర్ కలిసినట్లు ఈడీ వర్గాలు తెలిపాయి.
పెరోల్ పైబయటకు వచ్చిన సుకేష్ హీరోయిన్ జాక్వలెన్ కోసం ప్రైవేట్ జెట్ పంపించి మరీ తమిళనాడుకు తీసుకొని వచ్చి ఆమెతో రాసలీలలు సాగించినట్టు ఈడీ విచారణలో తేలింది. ఆ ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. సుకేష్ బలవంతపు వసూళ్ల కేసులో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని ఈడీ గుర్తించింది. జాక్వలైన్ కు సంబంధించిన ఆస్తులను కూడా అటాచ్ చేయడం ఇటీవల సంచలనంగా మారింది.
జాక్వెలైన్ కు భారీగా ధనం ఇచ్చి ముంబైలోని సముద్ర తీరానికి అభిముఖంగా ఒక విలాసవంతమైన అపార్ట్ మెంట్ ను కానుకగా సుకేష్ ఇచ్చాడని తెలిసింది. సుకేష్ తో ముద్దులు మురిపాలు అన్నీ ఆ అపార్ట్ మెంట్ లోనే సాగాయని తేలింది.
సుకేష్ కుంభకోణంలో జాక్వెలైన్ కు ఆర్థిక సంబంధాలున్నాయని ఈడీ తేల్చింది. రూ.10 కోట్ల మేర లబ్ధి పొందినట్టు ఈడీ గుర్తించింది. 7 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేశారు. సుకేష్ ఏకంగా జాక్వెలిన్ కు ఖరీదైన బహుమతులు కానుకగా ఇచ్చినట్టు తేలింది. అత్యంత ఖరీదైన డిజైనర్ బ్యాగులు, జిమ్ సూట్లు, వజ్రాల చెవిపోగులు, బ్రాస్ లెట్, మినీ కూపర్, ఇలా దాదాపు 10 కోట్ల విలువైన కానుకలను జాక్వెలిన్ కు సుకేష్ ఇచ్చినట్టు ఈడీ దర్యాప్తులో తేలింది. ఆధారాలు బలంగా ఉండడంతో జాక్వలైన్ పై ఈడీ చార్జిషీట్ దాఖలు చేసింది. దీంతో జాక్వలైన్ పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది.
తన ఫిక్స్ డ్ డిపాజిట్లపై జాక్వెలిన్ స్పందించింది. తనకు సుకేష్ పరిచయం కాకముందే ఈ డిపాజిట్లు చేశానని.. ఈ ఆదాయం చట్టబద్దమైనదని.. దానిపై పన్నుకూడా చెల్లించానని తెలిపింది. కొన్నేళ్లుగా సినీ పరిశ్రమలో కష్టపడి సంపాదించిన డబ్బు అది అని పేర్కొంది. సుకేష్ చంద్రశేఖర్ తెలియకముందే ఇదంతా సంపాదించానని పేర్కొంది. ఒక మహిళగా నేను కోల్పోయిన దానిని డబ్బుతో కొలవలేం అంటూ నోటీసులపై కౌంటర్ ఇచ్చింది.