Begin typing your search above and press return to search.

ఆ డైలాగ్‌ మహేష్ బాబు రియల్‌ ఇన్నర్‌ ఫీలింగ్‌..!

By:  Tupaki Desk   |   4 May 2022 5:29 AM GMT
ఆ డైలాగ్‌ మహేష్ బాబు రియల్‌ ఇన్నర్‌ ఫీలింగ్‌..!
X
మహేష్‌ బాబు వయసు 46 ఏళ్లు. ఆయన చిన్నప్పటి నుండే ఇండస్ట్రీలో ఉన్నాడు. హీరోగా ఎంట్రీ ఇచ్చి దాదాపుగా రెండు పుష్కరాలు అవుతుంది. ఆయన పిల్లలు పెద్ద వారు అవుతున్నారు. గౌతమ్‌ హీరోగా త్వరలో వస్తాడేమో... ఇక సితార ఇప్పటికే కెమెరా ముందు హడావుడి చేస్తూనే ఉంది. హీరోగా ఇప్పటికి కూడా టాలీవుడ్‌ లో టాప్ స్టార్‌ గా దూసుకు పోతున్నాడు. హీరోగా బ్రాండ్‌ అంబాసిడర్ గా ఫ్యామిలీ మ్యాన్ గా ఇలా ఎన్నో బాధ్యత లు నెత్తిన ఉన్నా కూడా ఇంకా మూడు పదుల వయసు కుర్రాడిగానే మహేష్ కనిపిస్తున్నాడు.

నాగార్జున వయసు కనిపించకుండా ఎప్పుడు ఒకేలా ఉంటాడు అని మహిళ అభిమానులు అంటూ ఉంటారు. ఆయన తర్వాత ఇప్పుడు మహేష్ బాబును ఆయన అభిమానులతో పాటు ఇతర హీరోల అభిమానులు కూడా వయసు పెరగకుండా అలాగే ఉన్నాడంటున్నారు. ఒక సారి జనాల్లో టాక్ వచ్చిందంటే దాన్ని కాపాడుకోవాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది.

సినిమాల్లో స్టార్‌ డమ్‌ అయినా... మరో విధంగా అయినా మంచి పేరు వస్తే దాన్ని కంటిన్యూ చేయాలని అనిపిస్తుంది. అందుకోసం చాలా కష్టపడాల్సి వస్తుంది. మహేష్‌ బాబు ఇప్పుడు అదే ఫ్రస్టేషన్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయిదు పదుల వయసు దగ్గర పడ్డ మహేష్ బాబు ను ఇంకా జనాలు మూడు పదుల వయసు లోనే ఉన్నాడంటూ పొగడ్తలతో ముంచెత్తుతూ ఉన్నారు.

ఆ పొగడ్తలు కంటిన్యూ అవ్వాలంటే.. వారి అభిప్రాయం నిలబెట్టాలంటే మహేష్ బాబు అదే ఫిజిక్ ను మరియు లుక్ ను మెయింటెన్ చేయాల్సి ఉంటుంది. అందుకోసం మహేష్‌ బాబు చాలా కష్టపడుతూ ఉన్నాడు. ప్రతి రోజు గంటల తరబడి జిమ్‌ లో వర్కౌట్‌ లు.. మితంగా ఆహారం.. యోగా ఇంకా ఎన్నో రకాల పనుల వల్లే ఆ లుక్ ను మెయింటెన్‌ చేస్తున్నాడు.

ఇన్ని పనులు చేయాలంటే ఎంత కష్టంగా ఉంటుందో సర్కారు వారి పాట సినిమాలోని ఒక డైలాగ్‌ ద్వారా చెప్పాడు. తాజాగా విడుదల అయిన ట్రైలర్‌ లో అప్పుడే మనకు మ్యారేజ్ చేసుకునే వయసు వచ్చిందంటావా అంటూ ప్రశ్నించగా కిషోర్ స్పందిస్తూ.. ఊరుకోండి సర్‌ మీకు అప్పుడే పెళ్లి ఏంటీ చిన్న పిల్లాడు మీరు. అప్పడు మహేష్‌ స్పందిస్తూ అందరు నీలాగే అనుకుంటున్నారు.. దీనమ్మ మెయింటెన్ చేయలేక దూల తీరిపోతుందంటాడు.

అది సినిమాలో డైలాగ్ అయినా మహేష్‌ నిజ నీవితంకు బాగా కనెక్ట్‌ అయ్యేలా ఉంది. అభిమానులు మహేష్ బాబును మూడు పదుల వయసులో ఉన్నాడంటూ పొగడ్తలు కురిపిస్తూ ఉంటే మహేష్ బాబు దాన్ని మెయింటెన్ చేసేందుకు చాలా కష్టపడుతున్నాడు అన్నమాట. ప్రస్తుతం మహేష్ డైలాగ్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.