Begin typing your search above and press return to search.

అ! దర్శకుడు.. ప్రోమోలకు స్పెషలిస్ట్

By:  Tupaki Desk   |   11 Aug 2022 5:10 AM GMT
అ! దర్శకుడు.. ప్రోమోలకు స్పెషలిస్ట్
X
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కొంతమంది యువ దర్శకులు సాగుతున్న విధానం చూస్తూ ఉంటే ఆశ్చర్యం కలుగుతుంది. పెద్దగా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు తిరగరాసే సక్సెస్ చూడకపోయినా కూడా ఓ వర్గం ప్రేక్షకుల్లో అయితే మంచి గుర్తింపున అందుకుంటున్నారు. అలాంటి యువ దర్శకుల్లో ప్రశాంత్ వర్మ ఒకరు. మొదట ఈ దర్శకుడు పలు రకాల యాడ్స్ తో అలాగే షార్ట్ ఫిలిమ్స్ తో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అయితే అందుకున్నాడు.

ఇక ఆ తర్వాత ప్రశాంత్ వర్మ నాని నిర్మాతగా వచ్చిన అ! సినిమాకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఆ సినిమా కమర్షియల్ గా అంతగా సక్సెస్ కాకపోయినప్పటికీ కూడా దర్శకుడిగా అతని పనితనానికి మంచి క్రేజ్ అయితే అందించింది. ఇక ఆ తర్వాత రాజశేఖర్ తో కల్కి అనే సినిమా తీశాడు. ఆ సినిమా కూడా సక్సెస్ కాకపోయినప్పటికీ విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ఇక మూడవసారి జాంబీ రెడ్డి అనే సినిమా తీసి బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సొంతం చేసుకున్నాడు.

ఇప్పుడు అదే సినిమా హీరో తేజ తోనే హనుమాన్ అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే ప్రశాంత్ వర్మ కేవలం సినిమాల వరకే పరిమితం కాకుండా అప్పుడప్పుడు స్పెషల్ ప్రోమోలతో కూడా తన టాలెంట్ ను బయటపెడుతున్నాడు.

ఇదివరకు అతను కొన్ని బిగ్ బాస్ సీజన్స్ కు ప్రత్యేకమైన ప్రోమోలను డైరెక్ట్ చేశాడు. వాటికి మంచి గుర్తింపు రావడంతో నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో కోసం కూడా వర్క్ చేశాడు.

బాలయ్య స్టైల్ హైలెట్ అయ్యేలా ప్రత్యేకంగా ప్రోమోల కోసం వర్క్ చేసిన విధానం అందరికి నచ్చింది. దీంతో అతని స్థాయి మరింత పెరిగిపోయింది. ఇక రీసెంట్ గా బిగ్ బాస్ తెలుగు ఆరవ సీజన్ కోసం కూడా అతను మొదటి ప్రోమోకి డైరెక్షన్ చేశాడు. అది కాస్త సంబంధం లేకుండా ఉంది అని కామెంట్స్ వచ్చినప్పటికీ కూడా ప్రశాంత్ వర్మ మాత్రం ఇండస్ట్రీలో ప్రోమోలకి స్పెషాలిస్ట్ గా క్రేజ్ అందుకుంటున్నాడు.

మరికొన్ని బిగ్ బాస్ 6 ప్రోమోలను కూడా త్వరలోనే విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ దర్శకుడు ఇంతకుముందే కొంతమంది హీరోలను కూడా కథలు చెప్పాడు. అలాగే సమంతతో కూడా ఒక కథ చేయాల్సి ఉంది. కానీ సరైన నిర్మాత దొరకక ప్రాజెక్ట్ కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. మరి రాబోయే రోజుల్లో ప్రశాంత్ వర్మ ఎలాంటి సినిమాలను తీస్తాడో చూడాలి.