Begin typing your search above and press return to search.
ఆ హీరో టాలీవుడ్ రన్వీర్ సింగ్: డైరెక్టర్ అనిల్ కామెంట్స్
By: Tupaki Desk | 8 March 2021 5:30 PM GMTటాలీవుడ్ సీనియర్ యాక్టర్ రాజేంద్రప్రసాద్, యువహీరో శ్రీవిష్ణు ముఖ్యపాత్రల్లో నటించిన 'గాలిసంపత్' మూవీ విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్బంగా మూవీ మేకర్స్ ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేశారు. గాలిసంపత్ మూవీ మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ట్రైలర్, సాంగ్స్ తో మంచి బజ్ క్రియేట్ చేసుకుంది ఈ సినిమా. అయితే ఆదివారం గాలిసంపత్ చిత్రబృందం ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హీరో రామ్ పోతినేని పాల్గొన్నాడు. ఈ సందర్బంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. హీరో రామ్ పోతినేనిని బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్‌తో పోల్చాడు. 'ఇస్మార్ట్ శంకర్' ట్రైలర్ చూసిన తర్వాత రామ్ టాలీవుడ్ రణ్‌వీర్ సింగ్ లా కనిపించినట్లు అనిల్ చెప్పుకొచ్చాడు.
ఎందుకంటే ఆ సినిమాలో రామ్ ఎనర్జీ లెవల్స్ ఆ రేంజిలో ఉంటాయని చెప్పాడు. కానీ డ్రెస్సింగ్ స్టైల్ తో పాటు ఇతర విషయాలను గమనిస్తే హీరో విజయ్ దేవరకొండకు దగ్గర పోలికలు ఉంటాయని చెప్పాడు. అయితే 'గాలిసంపత్' సినిమాతో పాటు మరో రెండు సినిమాలు విడుదల అవుతున్నాయి. అందులో ఒకటి శర్వానంద్ నటించిన ఫ్యామిలీ డ్రామా 'శ్రీకారం', రెండోది నాగ్ అశ్విన్ నిర్మించిన కామెడీ ఎంటర్టైనర్ 'జాతిరత్నలు'. ఈ రెండు సినిమాలతో గాలిసంపత్ పోటీపడనుంది. అయితే ఈ సినిమాకు సమర్పకుడిగా మాత్రమే కాకుండా స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించడంతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేసాడు అనిల్ రావిపూడి. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు అనిష్ కృష్ణ దర్శకత్వం వహించాడు. నిర్మాత ఎస్. కృష్ణ కథ అందించడం విశేషం.