Begin typing your search above and press return to search.

ప్రీ-రిలీజ్ కు 'కేటిఆర్'ను పిలవడానికి కారణం అదే: శర్వానంద్

By:  Tupaki Desk   |   10 March 2021 4:30 PM GMT
ప్రీ-రిలీజ్ కు కేటిఆర్ను పిలవడానికి కారణం అదే: శర్వానంద్
X
టాలీవుడ్ యువహీరో శర్వానంద్ ఇప్పటివరకు చాలా సినిమాలే చేసాడు. కానీ ఇప్పుడు రిలీజ్ అవుతున్న శ్రీకారం సినిమాను మాత్రం చాలా ప్రత్యేకంగా భావిస్తున్నాడు. ఎందుకంటే శర్వానంద్ శ్రీకారం సినిమా కథతో బాగా కనెక్ట్ అయ్యాడని చెప్పవచ్చు. అందుకే లాక్డౌన్ కాలంలో వ్యవసాయం చేయడం కూడా ప్రారంభించాడు శర్వా. 'దేశంలో రైతు తన కొడుకును ఎందుకు రైతుగా చేయలేకపోతున్నాడు..?' అనే ప్రధాన ఆలోచన తనకు బాగా నచ్చిందని ఇప్పటికే శర్వా పలుమార్లు ప్రకటించాడు. ఈ రకమైన సినిమాలు కమర్షియల్ హంగులతో తెరకెక్కించడం అంత సులభం కాదు. మహర్షి, శ్రీకారం సినిమాల మధ్య వ్యవసాయం టాపిక్ కనిపించినా.. మహర్షి సినిమాలో వ్యవసాయం అనేది ఓ టాపిక్ మాత్రమే. కానీ శ్రీకారం సినిమా పాయింట్ వ్యవసాయం కావడం ఇక్కడ విశేషం. ఈతరం వ్యవసాయాన్ని ప్రధాన వృత్తిగా ఎందుకు ఎంచుకోలేదని శ్రీకారంలో మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ చిత్రం రైతు సమస్యల గురించి.. అలాగే ప్రభుత్వ పథకాల గురించి పెద్దగా మాట్లాడదని చెప్పాడు శర్వా.

అలాగే 'నిజానికి సమిష్టి వ్యవసాయం ఒక లాభదాయక పద్ధతి. ఈ ప్రక్రియలో లాభాలను సమానంగా పంచుకోగలిగితే ప్రతి ఒక్కరూ జీవించగలరు. ఈ చిత్రం తనలో చాలా మార్పు తెచ్చింది. లాక్‌డౌన్ సమయంలో నేను నా ఫామ్‌హౌస్‌లో మూడు నెలలు గడిపాను. ఈ చిత్రం నాపై చూపిన ప్రభావం ఎంతంటే.. సినిమాలు చేయడం మానేస్తే వ్యవసాయం చేస్తాను. నా ఫామ్‌హౌస్‌లో గడపడం నేను నిజంగా ఆనందించాను. గ్రాండ్ రిలీజ్ ఫంక్షన్ కోసం కెటిఆర్‌ను ఆహ్వానించడానికి గల కారణాన్ని కూడా శర్వా బయటపెట్టాడు. కేటిఆర్ లాంటి డైనమిక్ నాయకుడు ఈ చిత్రం గురించి మాట్లాడితే అది ఎక్కువమందికి చేరుతుందని తెలిపాడు. ఈ ఏడాది తననుండి 3-4 మూవీస్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని పేర్కొన్నాడు. శ్రీకారంతో పాటు ఓ తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం, మహాసముద్రం ఈ ఏడాది తెరపైకి రానున్నాయట. అంతేగాక ఆడవాళ్లు మీకు జోహార్లు కూడా రెడీ అవుతోందట. చూడాలి మరి శర్వా నుండి ఎన్ని సినిమాలు వస్తాయో!