Begin typing your search above and press return to search.
అందుకే సాయిపల్లవి అంతగా ఏడ్చేసిందట!
By: Tupaki Desk | 21 Dec 2021 5:30 PM GMT'శ్యామ్ సింగ రాయ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజున సాయిపల్లవి ఏడ్చేసింది. దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ స్టేజ్ పై ఆమె పేరును ప్రస్తావించగానే ఆడియన్స్ లో నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. దాంతో సాయిపల్లవి ఒక్కసారిగా ఏడ్చేసింది.
ఆమె కళ్ల నుంచి నీళ్లు ధారగా కారిపోతూనే ఉన్నాయి. ఆ సమయంలో నాని ఆమెను కూల్ చేస్తున్నట్టుగా దగ్గరికి తీసుకుని భుజం తట్టాడు. ఆ తరువాత కూడా సాయిపల్లవి కన్నీళ్లు తుడుచుకుంటూనే మాట్లాడింది. ఆమె ఎందుకు అంతలా ఎమోషనల్ అయిందా అని మరికొంత మంది అనుకున్నారు.
అదే విషయం తాజా ఇంటర్వ్యూలో ప్రస్తావనకు వచ్చింది. అప్పుడు సాయిపల్లవి మాట్లాడుతూ .. " ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజున అక్కడి వాతావరణం అంతా కూడా మేము పడిన కష్టానికి తగిన గుర్తింపు లభిస్తున్నట్టుగా అనిపించింది. కళను అభిమానించనివారు ఎవరు? కళను ఆరాధించనివారు ఎవరు? అనిపించింది.
కళకు ఎప్పటికీ తగిన గౌరవం లభిస్తూనే ఉంటుంది .. కళాకారులకు అంతకంటే కావలసినదేముంటుంది? అనిపించింది. అదే సయమంలో ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. నా పేరు చెప్పగానే వాళ్లంతా చప్పట్లు కొడుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
నా పట్ల వాళ్లకి గల అభిమానాన్ని చూసి నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఆ క్షణంలో నేను స్టేజ్ పై ఉన్నాననే విషయాన్ని కూడా మరిచిపోయాను. ఇంట్లో సాయిపల్లవి ఎమోషన్స్ పరంగా ఎలా ఉంటుందో .. ఆ రోజున అక్కడ అలా ఉన్నాను. వీళ్లందరికీ నేను రుణపడిపోయానే అనే ఆనందమే ఆ రోజున నా కన్నీళ్లకు కారణం.
ఇక ఇంతకుముందు నాని .. నేను 'ఎంసిఎ' చేసినప్పటికీ, ఆ సినిమాతో దీనిని పోల్చలేం. ఈ సినిమాలో మా పాత్రలను మలిచిన విధానం కొత్తగా ఉంటుంది. నేను దేవదాసి పాత్రలో కనిపిస్తాను. ఈ పాత్రలో వాళ్ల సైకాలజీని అర్థం చేసుకుని నటించవలసి వచ్చింది.
నేను డాన్స్ బాగా చేస్తాను గనుక .. ఎలాగైనా ఇందులో ఒక మంచి డాన్స్ పెట్టాలి అనే ఉద్దేశంతో ప్రయత్నించలేదు. సందర్భానికి తగినట్టుగానే డాన్స్ ఉంటుంది. నా పాత్రకి ఎంత ప్రాధాన్యత ఉండాలో అంతే ప్రాధాన్యత తెరపై కనిపిస్తుంది. దర్శకుడు రాహుల్ కి ప్రతి పాత్ర విషయంలోను .. ప్రతి సన్నివేశం విషయంలోను పూర్తి క్లారిటీ ఉంది.
అందువల్లనే ఆయన చాలా పెర్ఫెక్ట్ గా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా రిలీజ్ డేట్ కోసం అందరిలా నేను కూడా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నాను. ఇక తెలుగులో 'విరాటపర్వం'తో పాటు తమిళంలో మరో సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి" అంటూ చెప్పుకొచ్చింది.