Begin typing your search above and press return to search.
ఆ కన్నడ బ్యూటీకి తెలుగులో మంచి బ్రేక్ దొరికేనా...?
By: Tupaki Desk | 30 Jun 2020 8:00 AM GMTరచితా రామ్.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని పేరు. కాకపోతే కన్నడ సినిమాలు కూడా చేసే తెలుగు ఆడియన్స్ కి అమ్మడి పేరు బాగానే రిజిస్టర్ అయ్యుంటుంది. రచితా రామ్ కన్నడలో సమంత రేంజ్ హీరోయిన్. ఇప్పటి వరకు కన్నడలో 30 సినిమాలకు పైగా నటించగా వాటిలో 20 సినిమాలు రిలీజ్ అవ్వగా 10 సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. కన్నడ సినీ అభిమానులు ఈ బ్యూటీ పేరు చెబితే ఊగిపోతుంటారు. అక్కడ అందరు టాప్ హీరోలతో ఈ బ్యూటీ స్క్రీన్ షేర్ చేసుకుంది. అయితే శాండిల్ వుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న రచిత టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలని సైతం రిజెక్ట్ చేసి క్రేజ్ లేని హీరో సినిమా కమిట్ అయింది. వివరాల్లోకి వెళ్తే రచితా రామ్ తెలుగు లో మెగా మేనల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా రూపొందుతున్న 'సూపర్ మచ్చి' సినిమా లో ఒక హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి పులివాసు దర్శకత్వం వహిస్తుండగా రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రిజ్వాన్ నిర్మిస్తున్నారు.
'సూపర్ మచ్చి' చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాతో పాటు టాలీవుడ్ లో మరో రెండు క్రేజీ ఆఫర్స్ వచ్చినా అమ్మడు తిరస్కరించిందట. బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన లో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా రచితా ని సంప్రదించారట. అయితే ఈ కన్నడ బ్యూటీ రిజెక్ట్ చేసిందట. దీంతో పాటు విక్టరీ వెంకటేష్ పక్కన నటించే ఛాన్స్ వచ్చినా అమ్మడు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదట. ఇక రచితా రామ్ ఫ్యాన్స్ తెలుగులో స్టార్ హీరోస్ తో నటించాల్సింది పోయి ఏమాత్రం క్రేజ్ లేని కళ్యాణ్ దేవ్ సినిమాతో ఇంట్రడ్యూస్ అవడం ఏంటని కామెంట్స్ చేస్తున్నారట. అయితే సీనియర్ హీరోస్ పక్కన నటిస్తే మళ్ళీ యంగ్ హీరోల పక్కన ఛాన్సెస్ వస్తాయో లేదో అని రచితా అలోచించి ఉండొచ్చు అనుకుంటున్నారు. మరి 'సూపర్ మచ్చి' సినిమా తర్వాత టాలీవుడ్ కుర్ర హీరోల నుంచి ఈ బ్యూటీ కి పిలుపు వస్తుందో లేదో చూడాలి.