Begin typing your search above and press return to search.

'నాట్యం' అంచనాలు పెంచే మరోటి..!

By:  Tupaki Desk   |   3 Oct 2021 8:30 AM GMT
నాట్యం అంచనాలు పెంచే మరోటి..!
X
నాగ చైతన్యతో సుదీర్ఘ ప్రేమాయణం తర్వాత సమంత పెళ్లి పీఠలు ఎక్కింది. పెళ్లి అయిన వెంటనే సమంత తన ట్విట్టర్‌ అకౌంట్‌ లో పేరులో అక్కినేని పదంను జత చేయడం జరిగింది. చాలా మంది పెళ్లి అయిన కూడా తమ పేరులో మార్చుకోలేదు. కాని సమంత మాత్రం తన పేరులో వెంటనే అక్కినేని పేరును జాయిన్ చేసి అందరి మనసులను దోచుకుంది. జంట అంటే ఇలా ఉండాలి అనేట్లుగా ఇద్దరు కూడా చాలా అన్యోన్యంగా ఉంటు అందరిని ఆకట్టుకున్నారు. పెళ్లి అయిన వెంటనే తన పేరులో అక్కినేని పేరును చేర్చుకుని అందరితో ప్రశంసలు అందుకున్న సమంత ఈమద్య కాలంలో తన పేరు నుండి అక్కినేని పదంను తొలగించడంతో చర్చ మొదలు అయ్యింది. కేవలం ఎస్‌ అనే అక్షరంతో మాత్రం ఆమె అకౌంట్‌ ఉంది.

సమంత మరియు నాగ చైతన్యలు విడాకుల విషయం ప్రకటించిన కొన్ని గంటల్లోనే ట్విట్టర్‌ లో మళ్లీ మార్పు కనిపించింది. సమంత మళ్లీ తన అకౌంట్ పేరును మార్చింది. కేవలం ఎస్ అనే అక్షరం మాత్రమే ఉండగా ఇప్పుడు దాన్ని సమంత అంటూ మార్చింది. సమంతకు ముందు వెనుక ఏమీ లేవు. మొత్తానికి సమంత ఇంత స్పీడ్‌ గా పేరు మార్పులు కూడా చర్చనీయాంశం అయ్యింది. సమంత అకౌంట్ మార్పు విషయం కూడా ఇప్పుడు సోషల్‌ మీడియాలో చర్చ జరుగోతంది. సమంత ఇంత స్పీడ్ గా మారి పోతుందా అంటూ కొందరు అంటూ ఉంటే.. సమంత వెంటనే రివీల్‌ చేయకుండా చేసిన ప్రయత్నంను కొందరు అభినందిస్తున్నారు.

నాగచైతన్యతో మొదటి నుండి చాలా ప్రేమతో ఉంటూ వచ్చింది. కలిసి ఉన్నన్ని రోజులు అతడికి ది బెస్ట్ ఇచ్చింది. అయితే ఇద్దరి మద్య చాలా పెద్ద విషయంలోనే విభేదాలు వచ్చి ఉంటాయి. అందుకే చాలా చర్చించుకుని కలిసి ఉండలేము అనే నిర్ణయానికి వచ్చి ఈ నిర్ణయం తీసుకుని ఉంటారు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నెట్టింట జరిగిన ప్రచారాలన్నింటికి తెర వేస్తూ వీరు క్లారిటీ ఇవ్వడంతో ఇంకా చర్చ లేకుండా పోయింది. వారు కలిసి ఉన్న నాలుగు సంవత్సరాలు కూడా నాలుగు వందల ఏళ్లు గుర్తు అన్నట్లుగా లైఫ్‌ ని ఎంజాయ్ చేశారు. గోవా.. మాల్దీవ్‌.. ఇంకా ఎన్నో హాలీడేస్ కు వెళ్లారు. ఇద్దరు కూడా జీవితాన్ని ఆస్వాదించారు. ఇప్పుడు ఇద్దరు వేరు వేరుగా మళ్లీ కొత్త జీవితాలను ప్రారంభిస్తారని ఆశిద్దాం.