Begin typing your search above and press return to search.

ఇది నిజంగా సిగ్గుమాలిన పనే

By:  Tupaki Desk   |   15 July 2017 6:15 PM GMT
ఇది నిజంగా సిగ్గుమాలిన పనే
X
కొద్ది రోజులు కిందట లండన్లో ఏ ఆర్ రెహ్మాన్ సంగీత సభ జరిగింది. ఈ గానసమ్మేళనంకు వచ్చిన కొంత మంది హింది అభిమానులు చేసిన మతిలేని పనికి దేశంలో పెద్ద చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. ప్రపంచం మొత్తం గర్వపడే ఒక సంగీత నేర్పరి పాడుతుంటే పాటలు నచ్చక బయటకు వెళ్లిపోతే పర్వాలేదు కానీ మా బాషలో పాటలు పాడలేదు అనే మూర్ఖత్వంతో బయటకువెళ్లిన సంఘటన లండన్లో చోటుచేసుకుంది. ఇలా జరిగినందుకు మన దేశ స్టార్ గాయని గాయకులు దేశ అభిమానులు, సంగీత అభిమానులు ఏ ఆర్ రెహ్మాన్ కు మద్దతుగా మాట్లాడుతున్నారు.

ఒక తమిళ్ సంగీత దర్శకుడు తమిళ్ పాటలు పాడినందుకు ఇంత రచ్చ చేస్తున్న మనవాళ్లని ఏమి అనుకోవాలో అర్ధం కావటంలేదు. ఇదే విషయం పై హీరోయిన్ లావణ్య త్రిపాటి కూడా ఆమె అభిప్రాయాన్ని చెప్పింది. “ఏ ఆర్ రహ్మాన్ ఆస్కర్ గెలుచుకున్నాడు. మన దేశం సంగీతాన్ని గౌరవాన్ని ప్రపంచ సంగీత వేదికపై గర్వంగా నిలబడేలాగా చేశాడు. కొన్ని పాటలు తమిళ్లో పాడినందుకు మేము సంగీత ప్రియులం అని ట్యాగులు వేసుకొని తిరుగుతున్న వాళ్ళు రెహ్మాన్ పాడుతుంటే లేచి వెళ్ళిపోయారు అది కూడా హింది పాటలు పాడలేదనే నెపంతో. ఇది నిజంగా సిగ్గిమాలిన పనే'' అని చెప్పేసింది. ఇదే విధంగా ప్రియాంక చోప్రా కూడా స్పందించింది. అసలు అలా చేయడం చాలా తప్పు అని పలికింది.

సంగీతం బాగుంటే అది ఏ భాషైన వింటారు సంగీత ప్రియులు. మరి మన దేశంలో ఆ సంగీత ప్రియలుకు మరో లక్షణం ఉంటుంది అదే ప్రాంతీయతత్వం అనే జబ్బు. రెహ్మాన్ సంగీత సభలో కూడ అటువంటి సైకాలజీ ఉన్న మనుషులు చేసిన చర్యగానే మనం భావించవచ్చు. కళకు జాతిని వర్గాన్నిఅంటగట్టి అవమానపరచని సమాజం ఉండాలి కాని.. వీళ్ళెక్కడి మనుషులండీ బాబూ!!