Begin typing your search above and press return to search.
MAA వార్: నటులు అన్ని రాష్ట్రాలకు చెందుతారు..!
By: Tupaki Desk | 2 July 2021 5:11 AM GMTమూవీ ఆర్టిస్టుల సంఘం(మా) ఎన్నికల్లో `స్థానికేతరుడు` అనే కాన్సెప్ట్ కూడా తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. నేను స్థానికుడిని.. వారు నాన్ లోకల్! అంటూ కొత్త అంశాన్ని బలంగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. ప్రకాష్ రాజ్ కర్నాటక వాసి. పరాయి భాషకు చెందిన వాడు. అతడికి తెలుగు వారి అసోసియేషన్ లో ఏంటి పని? అని ప్రశ్నించిన వాళ్లున్నారు. మూవీ ఆర్టిస్టుల సంఘం అధ్యక్ష పదవికి అతడు సరికాదని విమర్శించిన వారున్నారు.
అయితే అతడిపై అలా ప్రచారం చేసిన వారే తిరిగి మీడియా ముందు మాట మార్చారు. నటీనటుల సంఘం-మాలో సభ్యులు అయిన వారు ఎవరైనా పోటీ చేయొచ్చని అన్నారు. దీంతో నాన్ లోకల్ అన్న ఆ టాపిక్ కి వెయిట్ పడిపోయింది. మెగా కాంపౌండ్ మద్ధతు ఉన్న ప్రకాష్ రాజ్ పై ఇలాంటివేవీ నిలవడం లేదు. అతడిని గెలిపించుకునేందుకు వెంట ఇప్పటికే చాలా మంది చేరారు. గత మా కమిటీ సభ్యులు ప్రకాష్ రాజ్ ప్యానెల్ లోకి చేరడంతో ఇదే బలమైన ప్యానెల్ అంటూ ప్రచారం సాగింది.
అయితే బలమైన వ్యక్తిత్వం ఉన్న ప్రకాష్ రాజ్ కి బాసటగా మెగా కాంపౌండ్ నిలుస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి సపోర్ట్ ఉందని ఇప్పటికే నాగబాబు స్వయంగా ప్రకటించారు. అలాగే మా సభ్యుల్లో మెజారిటీ భాగం ప్రకాష్ రాజ్ వెంట నడుస్తున్నారన్న గుసగుసలు ఇంతకుముందు లీకయ్యాయి. ప్రత్యర్థులు ఎవరికి వారు తమ వంతు ప్రయత్నాల్లో ఉన్నా.. మెగాస్టార్ ని కలుస్తున్నా విలక్షణ నటుడి వెంటే మెగా కాంపౌండ్ ఉందన్నది స్పష్టంగా ఉంది.
ప్రకాష్ రాజ్ కర్ణాటకకు చెందినవాడే అయినా తెలుగు చిత్రాలలో ఎక్కువ ఆదరణ పొందారు. హైదరాబాద్ పరిసరాల్లో కూడా ఆస్తులను కలిగి ఉన్నారు. తెలంగాణ గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్నారు. ఆయన కుటుంబ నివాసం సహా పిల్లల్ని చదివించేది కూడా ఇక్కడే. అందువల్ల ఆయన స్థానికతపై ప్రశ్నించేవాళ్లు తెరవెనక మంత్రాంగం మాత్రమే నడిపించాల్సిన పరిస్థితి ఉంది.
తాజాగా ప్రకాష్ రాజ్ కి మరో సీనియర్ నటుడి మద్ధతు లభించింది. టాలీవుడ్ సీనియర్ నటుడు సుమన్ ప్రకాష్ రాజ్ కి బహిరంగ మద్ధతునిచ్చారు. ఈ పోటీకి ప్రకాష్ రాజ్ అర్హుడని.. స్థానికేతరుడు కానే కాదని సుమాన్ అన్నారు. నటులు లేదా తారలు అన్ని రాష్ట్రాలకు చెందిన వారవుతారని కూడా సుమన్ అభిప్రాయపడ్డారు. నిజానికి సుమన్ కూడా పొరుగు రాష్ట్రానికి చెందిన వారే. కానీ తెలుగు సినిమాల్లో నటించి గొప్ప పేరు తెచ్చుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో నివసిస్తూ ఆస్తులను కలిగి ఉన్నారు. తెలుగు గడ్డపై ఆయనకు విపరీతమైన అభిమానం ఉంది. అందుకే అతడు ప్రకాష్ రాజ్ కి మద్ధతునిచ్చారు.
మెగా కాంపౌండ్ అండదండలతో పాటు పూరి కాంపౌండ్ అండదండలు.. అలాగే సుమన్ వంటి సీనియర్ల అండదండలు పుష్కలంగా ప్రకాష్ రాజ్ కి లభించాయి. ఇక ఆయన గెలిచి తానేంటో నిరూపించడమే కీలకం. సెప్టెంబర్ లో మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నికలు జరగనున్నాయి. మంచు విష్ణు ఈ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ కి బలమైన పోటీదారుగా ఉంటారని అంచనా వేస్తున్నారు.