Begin typing your search above and press return to search.
కృష్ణవంశీలానే ఆ స్టార్ డైరెక్టర్ ప్రాబ్లెమ్!
By: Tupaki Desk | 17 Dec 2019 5:04 AM GMTక్రియేటివ్ డైరక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన `గోవిందుడు అందరివాడేలే` షూటింగ్ సమయంలో ఓ సమస్య అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. రామ్ చరణ్ తాత పాత్రలో తమిళ సీనియర్ నటుడు రాజ్ కిరణ్ సెట్ కాకపోవడంతో అతడిని విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తో రీప్లేస్ చేశారు. అయితే తాతతో మనవడి సన్నివేశాలు కొంతవరకూ చిత్రీకరించాక మధ్యలో రీప్లేస్ చేయడంతో ఆ సీనియర్ నటుడు ఎంతో ఫీలయ్యారు. ఇప్పుడు ఇంచుమించు అదే తరహా సమస్య బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టికి ఎదురైంది. వివరాల్లోకి వెళితే..
కిలాడీ అక్షయ్ కుమార్ నటిస్తున్న 'సూర్యవన్శీ' చిత్రానికి రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే కొంత భాగం చిత్రీకరణ కూడా పూర్తయింది. అయితే ఈ సినిమా నుంచి అర్థాంతరంగా సీనియర్ నటి నీనా గుప్తా తప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ చిత్రంలో హీరో అక్షయ్ కుమార్ కి తల్లిగా నీనా గుప్తా నటిస్తున్నారు. కొన్ని రోజులు ఆమెపై పలు కీలక సన్నివేశాల్ని కూడా చిత్రీకరించారు. అయితే సదరు సీనియర్ నటి పాత్రకు సినిమాకు ఎలాంటి సింక్ కుదరలేదట. దీంతో దర్శకుడు నీనా పాత్ర విషయంలో మనసుమార్చుకున్నారు.
ఈ విషయాన్ని నీనా గుప్తాతో చెప్పేందుకు రోహిత్ శెట్టి తటపటాయించాడట. అయితే ఆ విషయాన్ని నీనా అర్థం చేసుకున్నారు. సినిమాకి ఉపయోగపడని డమ్మీ పాత్రలో నటించడం ఇష్టంలేక ఆమె అర్థాంతరంగా సినిమా నుంచి తప్పుకున్నట్టు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ సినిమా నుంచి తప్పుకున్న నీనా గుప్తాకు తన నెక్స్ట్ మూవీలో అవకాశం ఇస్తానని రోహిత్ మాటిచ్చారట. ఇక ఈ సందిగ్ధత చూస్తే ఇంతకుముందు కృష్ణ వంశీ గోవిందుడు అందరివాడేలా చిత్రానికి ఇలాంటి సమస్య ఎదురైతే అప్పట్లో సీనియర్ నటుడు రాజ్ కిరణ్ స్థానంలో ప్రకాష్ రాజ్ ని తీసుకున్న సంగతి తెలిసిందే.
నీనా గుప్తా నాలుగు దశాబ్ధాల సీనియారిటీ ఉన్న అనుభవజ్ఞురాలైన నటి. 1982లో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా - దిల్లీలో నటశిక్షణ పొంది సినిమా రంగంలో ప్రవేశించారు. అటుపై ఎన్నో చిత్రాల్లో క్యారెక్టర్ నటిగా సత్తా చాటారు. ప్రస్తుతం ఆయుష్మాన్ ఖురానా నటిస్తున్న 'శుభ్మంగల్ జ్యాదా సావధాన్' చిత్రంలో నటిస్తోంది. ఎంటర్ టైన్ మెంట్ ప్రధానంగా నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 21న విడుదల కానుంది. పంగ అనే వేరొక చిత్రంలోనూ నటిస్తున్నారు.