Begin typing your search above and press return to search.

ఆ సూపర్ హిట్ సీక్వెల్‌ ఇక లేనట్లే

By:  Tupaki Desk   |   8 May 2022 3:30 AM GMT
ఆ సూపర్ హిట్ సీక్వెల్‌ ఇక లేనట్లే
X
పాతిక సంవత్సరాల క్రితం వచ్చిన 'భారతీయుడు' సినిమాకు దర్శకుడు శంకర్ సీక్వెల్‌ చేసేందుకు సిద్దం అయిన విషయం తెల్సిందే. లైకా ప్రొడక్షన్స్ వారు కమల్‌ మరియు శంకర్ లకు భారీ పారితోషికం ఇచ్చి సీక్వెల్ ను ప్రారంభించారు. సినిమా కొన్ని కారణాల వల్ల షూటింగ్ ఆరంభం అవ్వడానికి చాలా సమయం తీసుకుంది. షూటింగ్ ప్రారంభం అయిన తర్వాత ఏవో అవాంతరాలు వచ్చాయి.

కమల్‌ హాసన్ మరియు శంకర్ ల కలయికలో ఇండియన్ 2 ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ ఎదురు చూస్తున్న సమయంలో షూటింగ్ లో ప్రమాదం.. మృతి తో సినిమా ఆగిపోయింది. మళ్లీ మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయంటూ భావిస్తున్న సమయంలో దర్శకుడు శంకర్ మరియు నిర్మాతల మద్య వివాదం తలెత్తింది. సినిమా వివాదం కోర్టుకు చేరింది.

అక్కడ కూడా పరిష్కారం దక్కలేదు. ఇది చర్చించుకుని పరిష్కరించుకోవాల్సిన సమస్య అన్నట్లుగా వారు అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. ప్రస్తుతం రామ్ చరణ్‌ తో చేస్తున్న సినిమా షూటింగ్‌ పూర్తి అయిన తర్వాత రెండు మూడు నెలలు కేటాయించి ఇండియన్‌ 2 ను ముగించాలని శంకర్ భావిస్తున్నాడని.. కమల్‌ కూడా అందుకు సిద్దంగా ఉన్నాడనే వార్తలు వచ్చాయి.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అసలు శంకర్ మనసులో మైండ్‌ లో ఇండియన్ 2 గురించిన ఆలోచన లేదని తెలుస్తోంది. ఆర్‌సీ15 సినిమా పూర్తి అయిన శంకర్ సీక్వెల్‌ పనులు ముగిస్తాడని భావించారు. కాని ఆయన అపరిచితుడు రీమేక్‌ చేసేందుకు సిద్దం అవుతున్నాడు. హిందీలో శంకర్ దర్శకత్వంలో రణవీర్‌ సింగ్ హీరోగా అపరిచితుడు రీమేక్ కు ఏర్పాట్లు దాదాపుగా పూర్తి అయ్యాయి.

చరణ్ తో చేస్తున్న సినిమా ను సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌ నెలలో పూర్తి చేసేలా ప్లాన్‌ చేస్తున్నారు. ఆ వెంటనే అంటే ఇదే ఏడాది చివర్లో అపరిచితుడు సినిమా రీమేక్ షూటింగ్‌ మొదలు అవ్వబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. భారీ ఎత్తున లైకా ప్రొడక్షన్స్ వారు ఇండియన్ 2 సినిమాకు ఖర్చు చేయడం జరిగింది. ఇప్పుడు అది అంతా కూడా బూడిదలో పోసిన పన్నీరే అవ్వబోతుంది.

లైకా వారి విషయంలో దర్శకుడు శంకర్‌ చాలా సీరియస్ గా ఉన్నాడట. వారు కోర్టుకు వెళ్లడంతో మరింత పట్టుదలగా వారిపై ఆగ్రహంతో దర్శకుడు శంకర్ ఉన్నాడనే వార్తలు వస్తున్నాయి. తమిళ సినీ పెద్దలు శంకర్ మనసు మార్చేందుకు ప్రయత్నాలు చేసినా కూడా వర్కౌట్‌ అవ్వడం లేదు. కమల్‌ ప్రయత్నించినా కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదట. దాంతో ఆ సీక్వెల్‌ పై జనాలు ఆశలు వదిలేసుకోవాల్సిందే అంటూ టాక్‌ వినిపిస్తుంది.