Begin typing your search above and press return to search.

టైర్ 1 -టైర్ 2 న‌గ‌రాల‌పై థియేట‌ర్ల రాకాసి క‌న్ను!

By:  Tupaki Desk   |   21 Dec 2022 2:30 AM GMT
టైర్ 1 -టైర్ 2 న‌గ‌రాల‌పై థియేట‌ర్ల రాకాసి క‌న్ను!
X
దేశంలోనే అతిపెద్ద మల్టీప్లెక్స్ చైన్ ను రూపొందించడానికి PVR- ‍ ఐనాక్స్ లీజర్ మధ్య ప్రతిపాదిత విలీనం గురించి తెలిసిన‌దే. రెండు కంపెనీల బోర్డులు దేశంలోని అతిపెద్ద మల్టీప్లెక్స్ చైన్ ఆపరేటర్లు 1500 కంటే ఎక్కువ స్క్రీన్ ల నెట్ వర్క్ తో ఫిల్మ్ ఎగ్జిబిషన్ ఎంటిటీని రూపొందించడానికి ఆల్-స్టాక్ విలీనాన్ని ఆమోదించాయి. కానీ ప్రతిపాదిత ఎంవోయు పెట్టుబడిదారులకు అనేక ప్రశ్నలను మిగిల్చినా కానీ ఇటీవ‌ల ఈ ఒప్పందం లాభాల బాట ప‌ట్టింద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇరు సంస్థ‌ల విలీనం బాగా క‌లిసొచ్చింద‌ని తెలుస్తోంది.

క‌రోనా కాస్త తగ్గ‌గానే 2022లో సినిమా థియేటర్లకు జనం పోటెత్తడంతో PVR సినిమా ఆదాయంలో 1000 కోట్ల రూపాయలను దాటింద‌ని పీవీఆర్-ఐనాక్స్ బృందాలు వెల్ల‌డించాయి. ఇక పీవీఆర్ - ఐనాక్స్ లో పాప్ కార్న్ ఇత‌ర చిరు తిళ్లు పానీయాల రూపంలో అమాంతం ఆదాయం పెరిగింద‌ని స‌మాచారం. నిజానికి థియేట‌ర్ల రంగం క‌ష్టాల్లో ఉంద‌ని భావించేవారికి ఈ విలీన ఒప్పందం ఒక పాఠం లాంటిద‌ని విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు పూర్తిగా క‌రోనా అవాంత‌రాలు త‌గ్గ‌డంతో మ‌ల్టీప్లెక్స్ థియేట‌ర్ల‌కు ఊపు పెరిగింద‌ని స‌మాచారం. ఎటువంటి అవాంతరాలు లేకుంటే FY24 నాటికి EBITDAలో రూ. 1800 కోట్లను అందించగల సంస్థ గా మారుతుంద‌ని అంచ‌నా వేస్తున్న‌ట్టు సంబంధిత వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

వినోదం- వినోదం క‌ల‌యిక విన్-విన్ సిట్యుయేష‌న్ గా మారుతుంది. ``విలీనం మూలాధార థియేట‌ర్ల‌కు మరిన్ని మార్గాలను తెరిచింది. మరిన్ని స్క్రీన్ లను తెరవడం .. టైర్ 1 - టైర్ 2 నగరాల్లో ప్రేక్షకులను చేరుకోవడం ల‌క్ష్యాలుగా పీవీఆర్- ఐనాక్స్ స‌రికొత్త ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది. గత ఆరు సంవత్సరాలుగా ముంబై పరిశ్రమలో ఉన్న ఫ్రీలాన్స్ ఫిల్మ్ క్రిటిక్ విశాల్ అగర్వాల్ ఈ విలీనంపై విశ్లేషించారు. విలీనంలో షేర్-స్వాప్ నిష్పత్తి ఐనాక్స్ 10 షేర్లకు PVR మూడు షేర్ల వద్ద ఉంది - అంటే పెట్టుబడిదారులు ప్రతి 10 INOX షేర్లకు PVR మూడు షేర్లను పొందుతార‌ని విశ్లేషించారు.

PVR ప్రస్తుతం 73 నగరాల్లోని 181 ప్రాపర్టీలలో 871 స్క్రీన్ లను నిర్వహిస్తోంది. INOX 72 నగరాల్లోని 160 ప్రాపర్టీలలో 675 స్క్రీన్‌లను నిర్వహిస్తోంది. సంయుక్త సంస్థ `పీవీఆర్-ఐనాక్స్` భారతదేశంలో అతిపెద్ద ఫిల్మ్ ఎగ్జిబిషన్ కంపెనీగా అవతరిస్తుంది. 109 నగరాల్లోని 341 ప్రాపర్టీలలో 1546 స్క్రీన్ లను ప్ర‌స్తుతం నిర్వహిస్తోంది. అలాగే మెర్జ‌ర్ ఒప్పందం అనంత‌రం PVR నష్టాలను సగానికి పైగా తగ్గించింది.

PVR ఓ ప్రకటనలో సంయుక్త సంస్థ ప్రారంభమైనప్పటి నుండి ప్రతి సంవత్సరం 200కి పైగా స్క్రీన్ల‌ను పెంచడం స్వల్పకాలిక ప్రణాళిక అని వెల్ల‌డించింది. రెండు ప్రధాన మల్టీప్లెక్స్ ఎంటిటీలు ఒకటిగా మారతాయి కాబట్టి దీనివ‌ల్ల‌ పెట్టుబడి పెరుగుతుంద‌ని .. నిర్మాతలు మంచి నాణ్యమైన కంటెంట్ వైపు వెళతారని థియేట‌ర్ల రంగంలో మేధావులు విశ్లేషించారు.

PVR - ఐనాక్స్ విలీనం అనంత‌రం ముగిసిన సంవత్సరంలో ఐనాక్స్ లీజర్ కంటే స్క్రీన్ పై PVR యాడ్ (ప్ర‌క‌ట‌న‌ల‌) రాబడి 35 శాతం ఎక్కువగా ఉండగా గత రెండేళ్లుగా ఈ వ్యత్యాసం తగ్గింది. ఈ విలీనం వల్ల ప్రకటనల్లో గుత్తాధిపత్యం ఏర్పడే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేసారు. విలీన సంస్థ భారతదేశంలోని అన్ని ప్రధాన పట్టణ కేంద్రాలలో ప్రైమ్ ఏరియాల్లో స్థానాలను ఆక్ర‌మించింది. దీనివ‌ల్ల‌ అధిక ప్రకటన రేట్లను పొందవచ్చనేది ఒక వ్యూహం. విలీనం పేరుతో ప్ర‌క‌ట‌న‌ల‌ ధరలు పెంచార‌ని కూడా ఇటీవ‌ల‌ క‌థ‌నాలొచ్చాయి. విలీనంతో PVR ప్రకటనదారులతో INOXకి సహాయం చేస్తుంది. వారి ప్రకటన ఆదాయాన్ని స్కేలింగ్ చేస్తుంది. విలీనంతో యాడ్ రాబడిలో అంతరం మరింత తగ్గుతుంది ఎందుకంటే సంయుక్త సంస్థలు మెరుగైన రీచ్ తో అధిక రాబ‌డుల కోసం బేరసారాలు చేయగలవు అని ట్రేడ్ నిపుణులు విశ్లేషించారు.

ఈ విలీనం 1500 కంటే ఎక్కువ స్క్రీన్ ల పాన్-ఇండియా నెట్ వర్క్ తో PVR-ఐనాక్స్ కంబైన్ సైజ్ అంత‌కంత‌కు పెద్ద‌ద‌వుతోంది. PVRలో ప్రస్తుతం 871 స్క్రీన్ లు - ఐనాక్స్ కి 675 స్క్రీన్ లు ఉన్నాయి. కార్నివాల్ - సినీపోలిస్ లు ఒక్కొక్కటి 400 స్క్రీన్ లను కలిగి ఉన్నందున విలీనంతో పోటీని తగ్గించ‌గ‌లిగార‌ని విశ్లేష‌ణ సాగుతోంది.

ఇప్పుడు PVR-ఐనాక్స్ టైర్ 2- టైర్ 3 నగరాల్లోకి రావాలని ప్లాన్ చేస్తోంది. ప్రేక్షకులు ప్రకటనల పరంగా వ్యాపారాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. కానీ అద్దె స్థలం కోసం కార్పొరెట్ నేరుగా సింగిల్ స్క్రీన్ యజమానులను త‌మ చేతిలోకి లాక్కునే ఛాన్సుంద‌ని విశ్లేషిస్తున్నారు. ప్ర‌స్తుతం సింగిల్ స్క్రీన్లు ఉన్న ప్ర‌తి చోటా కొత్త థియేటర్లను నిర్మించేందుకు అప‌రిమితంగా విస్త‌రించేందుకు పీవీఆర్-ఐనాక్స్ యోచిస్తోంది. అటు ఉత్త‌రాదిన ఇటు ద‌క్షిణాదినా ఇంచుమించు ఇదే స‌న్నివేశం ఉంద‌ని తెలిసింది.

అలాగే పీవీఆర్‌- ఐనాక్స్ క‌ల‌యిక త‌ర్వాత‌ పాప్ కార్న్ కోక్ ల‌ అమ్మ‌కాలు పెరిగాయి. ఇప్పటికే ఉన్న స్క్రీన్ లు విలీనం తర్వాత వాటి బ్రాండ్ పేర్లను మార్చనందున ధరలు స్వ‌ల్పంగా పెరిగాయ‌ని విశ్లేషకులు చెబుతున్నారు. రెండు వేర్వేరు సంస్థలు ఒకే ఒక్కటిగా పనిచేస్తాయి కాబట్టి కన్సాలిడేషన్ జరుగుతుంది. దీనివ‌ల్ల ఇత‌రుల నుంచి గ‌ట్టి పోటీని తగ్గించవచ్చు.. డిస్కౌంట్లను అందిస్తూ ప్రేక్ష‌కుల‌ను ఎక్కువ‌గా థియేట‌ర్ల‌కు ర‌ప్పించే వ్యూహం కూడా దాగి ఉంద‌ని విశ్లేషిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.