Begin typing your search above and press return to search.

గుమ్మ‌డి రియ‌ల్ క్యారెక్టర్ అంతే!

By:  Tupaki Desk   |   28 Feb 2023 11:30 AM IST
గుమ్మ‌డి రియ‌ల్ క్యారెక్టర్ అంతే!
X
తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌కి దివంగ‌త న‌టుడు గుమ్మ‌డి వెంకేట‌శ్వ‌ర‌రావు కనుముక్కు అందించిన సేవ‌ల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఐదు ద‌శాబ్ధాల‌కు పైగా సినిమా రంగంలో కొన‌సాగారు. ఎన్టీఆర్..ఏఎన్నార్..కృష్ణ‌..శోభ‌న్ బాబు...కృష్ణంరాజు..చిరంజీవి లాంటి దిగ్గ‌జాల‌తో ఎన్నో సినిమాల‌కు ప‌నిచేసిన ఓ లెజెండ్. దాదాపు 500 సినిమాల్లో న‌టించారు. త‌న స‌హ‌జ న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన న‌టుడు. ఆ త‌ర్వాత ఆయ‌న‌లా వాస్త‌విక‌త‌తో రంజింపజేసిన న‌టులు చాలా త‌క్కువ మందే. ముఖ్యంగా అమాయ‌క హ‌వ‌భావాలు ప‌లికించ‌డంలో గుమ్మ‌డిది దిట్ట‌.

అయితే ఆయ‌న‌లో ఆ ర‌క‌మైన న‌ట‌న‌కి కార‌ణం గుమ్మ‌డిలో వాస్త‌విక‌తేన‌ని తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ఆయ‌న నాల్గ‌వ కుమార్తె శార‌ద రివీల్ చేసారు. సినిమాల్లోనే కాదు..బ‌య‌ట కూడా చ‌లా మోహ‌మాట‌స్తుడు. ఎవ‌రికి ఏది చెప్పాల‌న్నా చాలా ఇబ్బంది ప‌డేవారు. ఆయ‌న‌లో అమాయ‌క న‌టుడు ఇంట్లోనూ మాకు త‌రుచూ క‌నిపించేవారు. సినిమాల్లోకి వెళ్లిన త‌ర్వాత కొత్త వారినిక‌లిసి వేషాలు అడ‌గాలంటే ఆచాలా మోహ మాట ప‌డేవారు.

సినిమాల్లోనూ ఆయ‌న ఎలాంటి పాత్ర పోషించిన అంత‌ర్లీనంగా అమాయ‌క‌త్వం క‌నిపిస్తుంది. న‌టుడిగా రాణించ‌డానికి కార‌ణం కూడా అదే అనిపిస్తుంది. ఆయన ఫస్టు హీరోయిన్ జమునగారే. 'జై వీరభేతాళ' అనే సినిమాను చేశారు. ఆ సినిమా నిర్మాత చనిపోవటంతో మ‌ధ్య‌లోనే ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. గుమ్మడి గారి సంతానం ఏడుగురు. ఐదుగురు అక్కా చెల్లెళ్లం . ఇద్దరు సోదరులు. నేను నాలుగో అమ్మాయిని.

మాలో మా మూడో అక్కయ్య మాత్రం లేరు . 44 ఏళ్ల వయసులోనే కేన్సర్ తో చనిపోయింది. ఆమె మరణమే నాన్నగారిని బాగా కుంగదీసింది .. తన కంటే ముందుగానే కూతురు చనిపోవడాన్ని ఆయన తట్టుకోలేక పోయారు. ఆ సంఘ‌ట‌న ద‌గ్గ‌ర నుంచి నాన్న‌గారి హార్ట్ బ‌ల‌హీన ప‌డింది' అని అన్నారు. ఇక గుమ్మ‌డి వారస‌త్వాన్ని పుణికి పుచ్చుకున్న వార‌సులు లేరు. ఆ కుటుంబం నుంచి ఆయ‌న త‌ర్వాత ఎవ‌రు సినిమా రంగం వైపు రాలేదు. చ‌దువులు అనంత‌రం ఉద్యోగాలు..ఇత‌ర వ్యాపార‌ల్లో స్థిర‌ప‌డ్డారు. గుమ్మ‌డి 2010 లో స్వ‌ర్గ‌స్తులైన సంగ‌తి తెలిసిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.