Begin typing your search above and press return to search.
'ఉప్పెన' హిట్ కి ప్రధమ కారణం అదే!
By: Tupaki Desk | 26 March 2021 5:30 PM GMTతెలుగు తెరపై ప్రేమకథలు రాజ్యం చేస్తూనే ఉన్నాయి .. విలన్ ఎవరైనా ప్రేమజంటలు విరుగుడు కనిపెడుతూనే ఉన్నాయి.
బడ్జెట్ ను బట్టి కలలు కంటూనే ఉన్నాయి .. ఊహల రెక్కలు తగిలించుకుని పాటలు పాడుకుంటూనే ఉన్నాయి. ఒక అమ్మాయి - అబ్బాయి ప్రేమను అటు వైపు వాళ్లు .. ఇటు వైపు వాళ్లు అంగీకరించకపోవచ్చు. కానీ థియేటర్లో కూర్చున్న ప్రేక్షకులు మాత్రం సపోర్ట్ చేస్తారు. మీ వెనుక మేమున్నాం కానివ్వండి అంటారు .. తలదాచుకోవడానికి లవర్స్ ఎక్కడెక్కడికో పారిపోతుంటే, అంతకష్టపడటం ఎందుకూ? తమ ఇంటికి రావొచ్చుకదా అనుకుంటారు.
చాలావరకూ ప్రేమకథల్లో విలన్ .. అమ్మాయి తండ్రే అయ్యుంటాడు. మా నాన్న మాత్రమే ఎందుకు విలన్ కావాలి? అని హీరోయిన్ మారాం చేస్తే, అప్పుడప్పుడు హీరో ఫాదర్ కూడా విలన్ అవుతాడు. ఎప్పుడూ వీళ్లిద్దరేనా అనుకున్న దర్శకులు అమ్మాయి మేనత్తనో .. అబ్బాయి మేనత్తనో లైన్లోకి లాగుతారు. ఇలా ప్రేమకథలు తమ పాట్లు తాము పడుతూ వచ్చాయి. కానీ ఇటీవల కాలంలో ప్రేమకథా చిత్రాల్లో ప్రేక్షకుల అభిరుచి మారిపోయింది. టీనేజ్ లవ్ స్టోరీస్ ను చూడటానికే వాళ్లు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. కథలో కొత్త హీరోని .. కొత్త హీరోయిన్ ను చూడటానికే వాళ్లు ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తున్నారు.
సీనియర్ స్టార్ హీరోలు .. స్టార్ హీరోయిన్ల కాంబినేషన్లో గతంలో చాలా లవ్ స్టోరీస్ వచ్చాయి. వాళ్ల రొమాంటిక్ సీన్స్ ను ఆడియన్స్ ఎంజాయ్ చేశారు. వాళ్లిద్దరూ కలిసి పాడుకునే మెలోడీ పాటలను మనసు అరల్లో .. గుండెపొరల్లో దాచుకున్నారు. కానీ ఇప్పుడు కొత్త ప్రేమకథల్లో పాత హీరో హీరోయిన్లను చూడటానికి కుర్రకారు అంతగా ఉత్సాహం చూపడం లేదు. తెరపై వాళ్ల ఆటపాటలను ఫాలో కాలేకపోతున్నారు. ఇటీవల వచ్చిన 'ఉప్పెన' ప్రేమకథ జనంలోకి అంతగా వెళ్లడానికి ప్రధానమైన కారణం, హీరో - హీరోయిన్ కొత్తవాళ్లు కావడమేననే టాక్ బలంగా వినిపించింది. అందుకే ఆ ప్రేమజంటకి విశేషమైన ఆదరణ లభించింది. చూస్తుంటే .. ఇకపై ముదురు ప్రేమకథల ముచ్చటకి కాలం తీరిందనే అనిపిస్తోంది.