Begin typing your search above and press return to search.

ఇండస్ట్రీలో నాకు నిజమైన ఫ్రెండ్ ఆ ఒక్కడే

By:  Tupaki Desk   |   25 Jan 2022 3:58 AM GMT
ఇండస్ట్రీలో నాకు నిజమైన ఫ్రెండ్ ఆ ఒక్కడే
X
జగపతిబాబు చూడటానికి చాలా రఫ్ గా కనిపిస్తూ ఉంటారు .. కానీ నిజానికి ఆయన చాలా సెన్సిటివ్. ఎదుటివ్యక్తి ఎవరైనా కష్టాల్లో ఉంటే ఆయన చూడలేరు. తనవంతు సాయం చేయడానికి ప్రయత్నిస్తారు. ఆయన ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కోవడానికి కారణం ఇలా అందరినీ నమ్మేసి సాయం చేయడమేనని చాలామంది చెబుతుంటారు.

ఆయన కూడా కొన్ని ఇంటర్వ్యూలలో అదే మాటను చెబుతుంటారు. మనసులో ఒకటి పెట్టుకుని బయటికి ఒకటి మాట్లాడటం ఆయనకి తెలియదు. అలాంటి వాళ్లని కూడా ఆయన దూరం పెడుతుంటారు .. అలాంటి వాళ్లను తన స్నేహితులుగా చూడలేననీ .. చెప్పలేనని ఆయన తాజా ఇంటర్వ్యూలో అన్నారు.

ఆయన మాట్లాడుతూ .. " వర్మ ఒక తిక్కలోడు నన్ను ఏదో ఒకటి అంటూనే ఉంటాడు. నేను కూడా తిక్కలోడినే కనుక, నేను కూడా ఏదో ఒకటి అంటూనే ఉంటాను. మూడు పెగ్గులేసిన తరువాత ఇద్దరికీ కూడా గొడవవుతూనే ఉంటుంది.

ఇప్పుడు నేను తాగడం లేదు .. ఆయనను కలవడం లేదు కూడా. ఇంతకుముందు జరిగిన విషయాలు ఇవి. 'గాయం' సినిమా అప్పుడు నాకు .. ఊర్మిళకు మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ కావడం లేదని చెప్పాను. 'నువ్వంటే జగపతికి ఇష్టం లేదట' అని ఆమెతో అనేశాడు. 'నేనంటే ఎందుకు ఇష్టం లేదు' అని ఆమె నన్ను అడిగింది. 'ఊర్మిళ అంటే ఇష్టం అని చెబితేనే సినిమా ఫినిష్ చేస్తానని వర్మ అన్నాడు.

"ఇప్పుడు చెబుతున్నాను వర్మ .. నువ్వంటే ఇష్టం లేదు .. ఊర్మిళ అంటే ఇష్టం లేదు .. నువ్వు ఇష్టం అని చెబుతున్నావు గనుక శ్రీదేవి అంటే కూడా నాకు ఇష్టం లేదు" అని చెప్పేశాను. అప్పుడు ఆయన 'ఇదీ నాకు నచ్చింది' అన్నాడు. ఉన్నదున్నట్టుగా ముఖాన చెప్పినప్పుడు అది నచ్చిందని ఆయన అంటుంటాడు. ఇక విలన్ గా చేసి హీరోలు అయిన వాళ్లు ఉన్నారు .. మళ్లీ వాళ్లు విలన్ గా చేసి ఉండొచ్చు. కానీ నాకు తెలిసి హీరో నుంచి విలన్ అయింది మాత్రం నేనే. ఇండస్ట్రీలోనే కాదు .. ప్రపంచంలోనే టైమ్ బాగున్నప్పుడు ఒక రకంగా చూస్తారు .. మార్కెట్ లేనప్పుడు మరో రకంగా చూస్తారు. ఇక రాజకీయాలపై ఆసక్తి లేదు .. అన్ని అబద్ధాలు నేను ఆడలేను .. అంతమందిని హ్యాండిల్ చేయలేను.

ఇప్పుడున్న రోజుల్లో ఫలానా వాడు నా ఫ్రెండ్ అని చెప్పడానికి ధైర్యం సరిపోవడం లేదు. ఇండస్ట్రీలో నాకు జన్యున్ ఫ్రెండ్ అర్జున్. అలా కాకుండా నాకు ఫ్రెండ్ అని చెప్పడానికి ఎవరూ కనిపించడం లేదు. ఎక్కువ మంది 'రాత్ గయీ .. బాత్ గయీ' అంతే.

నాకు నేను మనకి ఫ్రెండ్ అని ధైర్యంగా చెప్పుకునే పరిస్థితి లేదు .. అలా ఉన్నారు జనాలు. జన్యూన్ గా ఎవరూ లేరు. అబద్ధాల్లోనే బతికేస్తున్నారు .. అబద్ధాలే నిజమనుకుని బతికేస్తున్నారు" అని చెప్పుకొచ్చారు.