Begin typing your search above and press return to search.

ఇందుకే చిరు మెగాస్టార్‌ అయ్యారు

By:  Tupaki Desk   |   13 March 2020 7:45 AM GMT
ఇందుకే చిరు మెగాస్టార్‌ అయ్యారు
X
మెగాస్టార్‌ చిరంజీవి ఈమద్య కాలంలో ఎక్కువ సినీ వేడుకల్లో కనిపిస్తున్నాడు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా సినిమాల వేడుకల్లో ఆయన పాల్గొనడం అభినందనీయం. చిన్న సినిమాలను ప్రోత్సహించడంతో పాటు పబ్లిసిటీ కల్పించేందుకు తనవంతు కృషి చేస్తున్న మెగాస్టార్‌ చిరంజీవిని ఈమద్య కాలంలో పలు సినీ వేదికల మీద ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. తన పై ఎవరైనా ప్రశంసలు కురిపించిన ప్రతిసారి ఆయన ఇంటికి వెళ్లిన తర్వాత నేలపై పడుకుంటాడట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పుకొచ్చాడు.

చిరంజీవి తాజాగా ఒక ఇంటర్వ్యూలో తనపై వస్తున్న ప్రశంసలకు స్పందిస్తూ నేను ఏ విజయాన్ని సొంతం చేసుకున్నా కూడా అది నా ఒక్కడి వల్ల వచ్చింది కాదు. నా విజయంలో ఎంతో మంది పాత్ర ఉంటుంది. అందుకే నన్ను ఎవరైనా పొగిడిన సమయంలో విజయగర్వం నెత్తికి ఎక్కకుండా ఉండేందుకు నేను కాసేపు నేలపై పడుకుంటాను. అలా చేయడం వల్ల ఆ పొగడ్తలు అనేవి నెత్తికి ఎక్కకుండా ఉండటంతో పాటు గర్వం అనేది దరి చేరదు అన్నాడు.

ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండాలంటూ చిరంజీవి చెప్పిన ఆయన మాటలు అందరికి ఆదర్శం. ఈ కారణాల వల్లే కదా ఆయన మెగాస్టార్‌ అయ్యింది అంటూ మెగా ఫ్యాన్స్‌ స్పందిస్తున్నారు. ఒకటి రెండు సక్సెస్‌ లు వచ్చిన వారు పొగరు చూపించి కెరీర్‌ కొన్నాళ్లకే కనిపించకుండా పోతారు. అలాంటి వారు మెగాస్టార్‌ ను చూసి నేర్చుకోవాల్సిందే అంటున్నారు.

ఇక చిరు ప్రస్తుతం తన 152వ చిత్రం ఆచార్యను కొరటాల శివ దర్శకత్వం లో చేస్తున్నాడు. రామ్‌ చరణ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. మెగాస్టార్‌ ఆ తర్వాత సినిమాను త్రివిక్రమ్‌ దర్శకత్వంలో చేస్తాడనే వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. లూసీఫర్‌ రీమేక్‌ పై కూడా చిరు ఆసక్తిగా ఉన్నాడట. అది కూడా త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.