Begin typing your search above and press return to search.
'పబ్'ను వీడిన ప్రణీత.. ఎందుకంటే..?
By: Tupaki Desk | 7 May 2020 3:32 AM GMTటాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ పొందిన హీరోయిన్ ప్రణీత. ఈ ముద్దుగుమ్మ పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది చిత్రంలో సెకండ్ హీరోయిన్‌గా నటించినప్పటికీ మంచి పేరు సంపాదించింది. ఆ తర్వాత ప్రణీత నటించిన సినిమాలేవి పెద్దగా హిట్ కాలేదు. ప్రస్తుతం ఆఫర్స్ కూడా పెద్దగా లేవు. కాని కరోనా సంక్షోభంలో తనకి ఉన్నంత దానిలో సాయం చేస్తూ అందరి మనసులలో చెరగని ముద్ర వేసుకుంది. కరోనా బాధితుల కోసం తెలుగు సినిమా పరిశ్రమ నుండి హీరోయిన్స్ లో మొదటి విరాళంను ప్రకటించిన ప్రణీత. ఇప్పుడు తన ఇంటి చుట్టుపక్కన ఉండే వారు. ఆకలితో అలమటించే వారి కోసం స్వయంగా వంట చేసి వారి ఆకలి తీర్చుతోందట.
అత్తారింటికి దారేది తర్వాత కమర్షియల్ బ్రేక్ రాకపోవడంతో టాలీవుడ్‌లో ప్రణీతకు అవకాశాలు తలుపు తట్టలేదు. తన మాతృభాష కన్నడలో కూడా ప్రణీతను గుర్తించిన వారెవరూ లేరు. చిత్ర సీమలో ఇలాంటివి సహజమే. బ్రేక్ వచ్చేవరకు వేచి ఉండాల్సిందే. ఇలా వెయిట్ చేస్తూనే తన దృష్టిని వ్యాపారం వైపు మళ్లించింది ప్రణీత. కుర్రకారు మెచ్చే బిజినెస్ అయితే బెటర్ అనే ఉద్దేశంతో బెంగళూరులో బూట్‌లెగ్గర్ పేరుతో ఒక పబ్ వ్యాపారం స్టార్ట్ చేసింది. ఐటీ యూత్ ఎక్కువగా సంచరించే ప్రాంతంలోనే ఈ పబ్ నెలకొల్పడం విశేషం. సహజంగా హీరోయిన్లు పబ్ బిజినెస్ చేయడం అరుదు.
తమకు కొంత టచ్ ఉన్న ఫ్యాషన్ డిజైనింగ్, లేదా ఖరీదైన బ్యూటీపార్లర్లను నిర్వహిస్తుంటారు. దీనికి విరుద్ధంగా ప్రణీత పబ్ ఏర్పాటుచేయడం పట్ల చాలామంది ఆసక్తిి కనబరిచారు. ఇక గతంలో "బూట్లెగర్ నన్ను రక్షించడమే కాదు, నా వ్యాపార దాహాన్ని తీర్చడానికి మాత్రమే" అని చెప్పి.. ఇటీవలే తను బూట్లెగర్ పబ్ బిజినెస్ నుండి బయటకు వచ్చానని.. అంతేగాక ఇప్పుడు మరో వ్యాపారం ప్రారంభించడానికి ఎదురు చూస్తున్నానని స్పష్టం చేసింది. మరోవైపు, ప్రణీత అనేక కోవిడ్-19 సహాయక చర్యలలో చురుకుగా పాల్గొంటూ అందరి మన్ననలు పొందుతుంది.