Begin typing your search above and press return to search.

ఫ్యామిలీ మ్యాన్ అందుకే చేసిందట

By:  Tupaki Desk   |   13 Jun 2021 9:05 AM GMT
ఫ్యామిలీ మ్యాన్ అందుకే చేసిందట
X
కరోనా దెబ్బకు థియేటర్లు బంద్ కావటం.. వినోదానికి బోలెడంత స్పేస్ వచ్చేసిన వేళ.. ఓటీటీ ప్లాట్ ఫాంలు ఆ ఖాళీని భర్తీ చేసే పనిలో పడ్డాయి. సినిమాలకు మించిన సరికొత్త వినోదాన్ని వెబ్ సిరీస్ లతో అందించే ప్రయత్నాలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. కరోనాకు ముందే వెబ్ సిరీస్ లు ఉన్నా.. ఇప్పుడు వాటికున్న ఆదరణ గతంలో లేదని చెప్పాలి. ఇంటి నుంచే పని చేయాల్సి రావటం.. లాక్ డౌన్ తదితర కారణాలతో ఇంటికే పరిమితం కావాల్సిన వేళలో.. వెబ్ సిరీస్ లు వినోద దాహాన్ని తీరుస్తున్నాయని చెప్పాలి.

ఇప్పటివరకు ఎన్నో వెబ్ సిరీస్ లు వచ్చినా.. ఫ్యామిలీ మ్యాన్ కు ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. ఇటీవల రెండో సిరీస్ రావటం.. తొలి సిరీస్ తో పోల్చినప్పుడు ఆదరణ భారీగా రావటం తెలిసిందే. రెండో సిరీస్ మొత్తం సమంత చుట్టూనే తిరగటం.. ఆమె రోల్ కీలకం కావటంతో మార్కులన్ని ఆమెకు.. మనోజ్ బాజ్ పేయ్ కే పడ్డాయి. మొదటిసిరీస్ లో ప్రియమణి పాత్రకు ఉన్న ప్రాధాన్యత రెండో సిరీస్ లో తగ్గిందనే చెప్పాలి.

అయితే.. ఈ సిరీస్ కు తాను ఓకే చెప్పటానికి కారణం తన భర్త రాజ్ అని చెబుతోంది. ఫ్యామిలీమ్యాన్ వెబ్ సిరీస్ ఛాన్సు కోసం వచ్చినప్పుడు.. ఆ ప్రాజెక్టు చేయాలా? వద్దా? అన్న సందేహంలో ఉన్న వేళ.. తన భర్త ముస్తఫా రాజ్ కలుగజేసుకొని.. వారంతసేపు వచ్చి మాట్లాడారంటే నువ్వు నటించాలని వాళ్లు అనుకుంటున్నారు కదా? ఓకే చెప్పేయ్ అని చెప్పటంతోనే తాను సిరీస్ చేశానని.. లేదంటే వద్దనే చెప్పేద్దాన్నేమో అని చెప్పింది. ఏమైనా ఫ్యామిలీ మ్యాన్ చేయటం ద్వారా ప్రియమణి ఇమేజ్ పెరిగిందనే చెప్పాలి.