Begin typing your search above and press return to search.

థియేటర్లు ఓపెన్ అయ్యేది అప్పుడేనట.. పరిశ్రమకు షాకిస్తున్న కొత్త వాదన

By:  Tupaki Desk   |   16 July 2021 5:51 AM GMT
థియేటర్లు ఓపెన్ అయ్యేది అప్పుడేనట.. పరిశ్రమకు షాకిస్తున్న కొత్త వాదన
X
కరోనా కారణంగా దెబ్బ పడని రంగమే లేదు. దీనికేమైనా మినహాయింపు ఉందంటే.. అదొక్క హెల్త్ సెక్టార్ మాత్రమే. దాన్లో కూడా పెద్ద పెద్ద వాళ్లే బాగే పడ్డారు కానీ.. చిన్న వాళ్లు ఎదుర్కొన్న సమస్యలు అన్ని ఇన్ని కావు. కరోనా కారణంగా ప్రభుత్వం విధించిన ఆంక్షలు.. లాక్ డౌన్ కారణంగా ఫుడ్.. హోటల్ ఇండస్ట్రీతో పాటు టూరిజం.. సినిమా పరిశ్రమకు తగిలిన దెబ్బ అంతా ఇంతా కాదు. సెకండ్ వేవ్ తగ్గి.. పరిస్థితులు నార్మల్ కు వచ్చినప్పటికీ ఇంకా సినిమా థియేటర్లు ఓపెన్ కాకపోవటం తెలిసిందే.

తొలుత వేసుకున్న అంచనా ప్రకారం.. జులైన మూడో వారం కానీ.. ఆగస్టు మొదటి వారం కానీ సినిమాలు థియేటర్లలో విడుదలయ్యే అవకాశం ఎక్కువగా ఉందన్న మాట వినిపించింది. అయితే.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. థియేటర్లు ఇప్పటికిప్పుడు విడుదలయ్యే అవకాశం లేదని చెబుతున్నారు. ఎందుకంటే.. తెలంగాణలో కేసుల నమోదు భారీగా తగ్గినప్పటికి ఏపీలో మాత్రం అలాంటి పరిస్థితి లేకపోవటంతో లాక్ డౌన్ ఎత్తేయలేదు. తెలంగాణలో థియేటర్లు తెరవటానికి అనుమతి ఇచ్చిన నెల తర్వాతే ఏపీలో థియేటర్లు అనుమతికి ప్రభుత్వం ఓకే చెప్పింది.

థియేటర్లు ఓపెన్ చేసేందుకు ప్రభుత్వం ఓకే చెప్పినా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రేక్షకుల స్పందన ఏమిటన్నది ప్రశ్నగా మారింది. మరోవైపు.. థర్డ్ వేవ్ వచ్చేస్తుందన్న మాట ఇప్పుడు కొత్త టెన్షన్ గా మారింది. మొదట అనుకున్న అంచనా ప్రకారం సెప్టెంబరు మధ్య నుంచి మొదలై నవంబరు చివరి వరకు సాగుతుందన్న అంచనాలు ఉన్నాయి. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత నుంచి ప్రజలు పెద్ద ఎత్తున రాకపోకలు చేపట్టటం.. ప్రపంచ వ్యాప్తంగానెలకొన్న ట్రండ్ చూస్తుంటే.. థర్డ్ వేవ్ షురే అయినట్లుగా వార్తలు వస్తున్నాయి.

రెండు తెలుగు రాష్ట్రాల్లో కేసుల నమోదు పెరుగుతున్నట్లు చెప్పకున్నా..కొన్ని అంతర్గత రిపోర్టుల మాత్రం కేసుల నమోదు పెరుగుతున్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. దీంతో.. థియేటర్లు ఓపెన్ చేసినా.. మహా అయితే మూడు వారాలకు మించి తెరిచి ఉంచే అవకాశం లేదని.. కేసుల సంఖ్య పెరిగినంతనే లాక్ డౌన్ విధించే వీలుందన్న మాట వినిపిస్తోంది.

దీంతో.. థియేటర్లను ఇప్పుడు తెరిచి.. అంతనే మూసి వేయటం కష్టంతో కూడుకున్నదని.. అందుకే.. మరికొంత కాలం థియేటర్లను మూసి ఉంచటమే మంచిదన్న మాట వినిపిస్తోంది. ఈ విషయాల్ని గుర్తించిన సురేశ్ బాబు.. తమ నారప్ప మూవీని ఓటీటీ ఫ్లాట్ ఫాంలో ప్రదర్శించేందుకు ఓకే చెప్పేసినట్లుగా విశ్లేషిస్తున్నారు. తొలుత అనుకున్నట్లుగా థియేటర్లు ఇప్పట్లో తెరుచుకునే వీల్లేదని.. అన్ని బాగుంటే.. నవంబరు మధ్య నుంచి డిసెంబరు మొదటి వారంలోనే తెరిచే వీలుందని చెబుతున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.