Begin typing your search above and press return to search.
నా కూతురు పిక్ అందుకే షేర్ చేయనుః కోహ్లీ
By: Tupaki Desk | 30 May 2021 11:30 PM GMTసోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉండే కపుల్స్ లో.. టీమిండియా కెప్టెన్ కోహ్లీ- అనుష్క శర్మ ముందు వరసలో ఉంటారు. ఆ మధ్య వీరిద్దరూ పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. ఇప్పటి వరకు తమ కూతురు వామిక ముఖాన్ని నెటిజన్లకు చూపించలేదు. సోషల్ మీడియాలో ముగ్గురూ ఉన్న పిక్ షేర్ చేసినప్పటికీ.. ఫేస్ కనిపించలేదు. అయితే.. కావాలనే ముఖం కనిపించకుండా జాగ్రత్తపడ్డారీ దంపతులు. దీంతో.. ఎందుకిలా చేశారన్నది ఎవ్వరికీ అర్థం కాలేదు.
తాజాగా ఇన్ స్టా వేదికగా.. అభిమానులతో క్వశ్చన్ అవర్ నిర్వహించాడు విరాట్. వారు అడిగిన ఎన్నో ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇచ్చాడు. ఇందులో కొందరు కోహ్లీ కూతురి గురించి అడిగారు. ఇప్పటి వరకూ వామికను ఎందుకు చూపించలేదు? ఆ చిన్నారి ఫొటోను మేం చూడొచ్చా? అని ఓ నెటిజన్ అడిగారు.
దానికి.. ఉద్దేశపూర్వకంగానే తమ కూతురి చిత్రాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయలేదని సమాధానం ఇచ్చాడు కోహ్లీ. దానికి కారణం ఏంటన్నది కూడా చెప్పాడు. సోషల్ మీడియా అంటే ఏంటన్నది తన కూతురికి అర్థమైన రోజున, అవగాహన కలిగిన రోజున తనే షేర్ చేస్తుందని చెప్పాడు.
ఆమె తన ఫీలింగ్స్ ను సొంతంగా వ్యక్తం చేసే వరకు తన ఫొటోలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలని నిర్ణయించామన్నాడు. భార్య అనుష్క, తాను కలిసే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాడు కోహ్లీ.
ఇక, తన కూతురి పేరుకు అర్థమేంటని ఓ నెటిజన్ అడగ్గా.. దాన్ని కూడా వివరించాడు. వామిక అంటే.. దుర్గామాతకు ఉన్న మరోపేరు అని చెప్పాడు కోహ్లీ. ఈ విధంగా తన కూతురికి సంబంధించిన విషయాలను వెల్లడించాడు. ఇదే విషయాన్ని గతంలోనూ ఓ సారి చెప్పారు కోహ్లీదంపతులు.