Begin typing your search above and press return to search.
'ఆదిపురుష్' లుక్ అంతా అనుకున్నట్లుగా ఉండదట!
By: Tupaki Desk | 20 April 2021 11:30 PM GMTప్రభాస్ హీరోగా ఓమ్ రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆదిపురుష్ సినిమా షూటింగ్ 30 శాతంకు పైగా పూర్తి అయ్యిందట. ముంబయిలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం పాక్షిక లాక్ డౌన్ ను అమలు చేస్తోంది. దాంతో ఆదిపురుష్ సినిమా షూటింగ్ ను క్యాన్సిల్ చేసుకుని ఇటీవలే ప్రభాస్ హైదరాబాద్ చేరుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా షూటింగ్ కు జాయిన్ అయ్యేందుకు సిద్దం అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక ఆదిపురుష్ గురించి మొదటి నుండి అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. మేకర్స్ నుండి వస్తున్న వార్తలను బట్టి ఈ సినిమా రామాయన ఇతివృత్తంతో రూపొందుతున్నట్లుగా క్లారిటీ వచ్చింది.
రామాయణంలో ఆదిపురుష్ అంటే రాముడే. ఆ రాముడి పాత్రను ప్రభాస్ పోషిస్తున్నాడు. కనుక రాముడిగా ప్రభాస్ ఎలా ఉంటాడో ఇప్పటికే జనాలు ఊహించుకుంటున్నారు. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో ఎన్నో భాషల్లో రామాయణ కథలతో సినిమాలు వచ్చాయి. వాటన్నింటిలో కూడా రాముడు అంటే ఒకే తరహాలో చూపించడం జరిగింది. కాని ఓమ్ రౌత్ మాట్లాడుతున్న మాటలను బట్టి చూస్తుంటే ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్న తీరు చాలా ప్రత్యేకంగా ఉంటుందట. ఆయన చెబుతున్న దాని ప్రకారం ఆదిపురుష్ లో ప్రభాస్ లుక్ చూసి అవాక్కవుతారట.
రాముడు అంటే బాణం.. నీలి వర్ణం కలిగి ఉండకుండా కస్త విభిన్నం అన్నట్లుగా ఆదిపురుష్ లో ప్రభాస్ ను దర్శకుడు చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. రేపు శ్రీరామ నవమి సందర్బంగా ఆదిపురుష్ నుండి ఏదైనా స్పెషల్ పోస్టర్ వస్తుందని అంతా భావించారు. కాని కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆదిపురుష్ నుండి రేపు ఎలాంటి అప్డేట్ రాకపోవచ్చు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఇండియాలో ఇప్పటి వరకు రాని విధంగా విజువల్ వండర్ గా అద్బుతమైన టేకింగ్ తో ఈ సినిమాను ఓమ్ రౌత్ రూపొందిస్తున్నాడు. సీత పాత్రలో కృతి సనన్ నటిస్తుండగా రావణుడి పాత్రను బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ చేస్తున్నాడు.