Begin typing your search above and press return to search.
ఒక్కడితో పైరసీ ఆగిపోతుందా?
By: Tupaki Desk | 13 Sep 2017 4:13 PM GMTదేశీయ సినిమా రంగాన్ని వెంటాడుతున్న అతి పెద్ద భూతం పైరసీ. గతంలో సినిమా పైరసీ కూడా ఉండేది కానీ.. ఇప్పుడు మరీ పెచ్చుమీరి పోయింది. సినిమా రిలీజ్ అయిన గంటల వ్యవధిలోనే నెట్ లో ప్రత్యక్షమైపోతోంది. కొన్ని సినిమాలైతే విడుదలకు కొన్ని వారాల ముందే ఆన్ లైన్ లోకి వచ్చేయడం కూడా చూశాం.
తమిళనాడులో పైరసీ చేయడంలో ఒక కీలక గ్రూప్ తమిళ్ రాకర్స్. సినిమా రిలీజ్ అయిన గంటల్లోనే మొదట థియేటర్ ప్రింట్.. ఒకటి రెండు రోజుల్లో హై క్వాలిటీ ప్రింట్స్ సంపాదించేసి నెట్ లో పెట్టేయడంలో వీళ్లు దిట్ట. తమిళ్ మూవీ కలెక్షన్స్ ను దెబ్బ తీయడంలో వీరిది కీలక పాత్ర అని ఇండస్ట్రీ వర్గాలు అంటాయి. ఎంతో కష్టపడి.. పరిశోధించి.. ఎట్టకేలకు పోలీసులు ఈ తమిళ్ రాకర్స్ సైట్ కు చెందిన ఓ అడ్మిన్ ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ అడ్మిన్ చెన్నైలోని ట్రిప్లికేన్ డీ-1 స్టేషన్ లో ఉన్నాడనే సంగతిని పోలీసులు కూడా ధృవీకరించారు. ప్రస్తుతం నడిగర్ సంఘం కీలక బాధ్యతల్లో ఉన్న విశాల్.. ఎంతో ఒత్తిడి చేసిన పిమ్మట ఇతడిని అరెస్ట్ చేశారట చెన్నై పోలీసులు.
అయితే.. ఫైనల్ గా ఒక పైరసీ పెద్దోడ్ని పోలీసులు ఊచలు లెక్క పెట్టించగలిగారు. అయితే తమిళ్ రాకర్స్ గ్రూపులో చాలామంది పంపిణీదారులు ఉన్నారనేది ఆరోపణ. అందుకు ఆధారాలు కూడా వారు చూపగలరు. ఏ దేశంలో ఫస్ట్ కాపీ టెలికాస్ట్ చేసినా.. అది ఈ తమిళ్ రాకర్స్ చేతికి చిక్కుతుండడమే కారణం. పైగా లోకల్ గా కూడా థియేటర్ ప్రింట్స్ సంపాదించడానికి వీరికి పెద్ద ఎత్తునే కాంటాక్ట్స్ ఉన్నాయట. మరి వీరిందరినీ పట్టుకుని అరెస్ట్ చేయడం సాధ్యమేనా అన్నది ఇప్పుడు చాలామంది డౌట్.