Begin typing your search above and press return to search.

ప్రేమ‌ప‌క్షుల ఏజ్ గ్యాప్.. లైఫ్ ట్విస్టులు షాకింగే!

By:  Tupaki Desk   |   31 Oct 2022 3:30 PM GMT
ప్రేమ‌ప‌క్షుల ఏజ్ గ్యాప్.. లైఫ్ ట్విస్టులు షాకింగే!
X
అదితీరావు హైదరి భారతీయ చలనచిత్ర పరిశ్రమలోని అత్యంత సొగసైన అందమైన నాయికగా పాపుల‌రైంది. త‌న‌దైన ప్ర‌తిభ‌ అద్భుత నటనతో క‌వ్వించే విరుపుతో ల‌క్ష‌లాదిగా ప్ర‌జ‌ల‌ హృదయాలను గెలుచుకుంది. అవార్డుల పెర్ఫామ‌ర్ గాను అదితీ అతి త‌క్కువ స‌మ‌యంలో ఫేం సంపాదించింది. అసాధారణమైన ప్రతిభతో షైన్ అవుతున్న ఈ బ్యూటీ హీరో సిద్ధార్థ్ తో డేటింగ్ లో ఉండ‌డం స‌ర్వ‌త్రా హాట్ టాపిక్ గా మారింది. చెన్నై మీడియాలో ఈ జంట‌పై రోజుకో క‌థ‌నం హీటెక్కిస్తోంది.

అదితీ బ‌హుభాషా చిత్రాల న‌టి. హిందీ- తమిళం- తెలుగు - మలయాళం చిత్రాలలో సంవత్సరాలుగా విస్తృతంగా ప్రచారం పొందింది. ఆస‌క్తిక‌రంగా హైద‌రీ బ్యాక్ గ్రౌండ్ తెలుగు నేటివిటీతో ముడిప‌డిన‌ది. హైదరాబాద్ సమీపంలోని రెండు రాజ వంశాలకు చెందిన చ‌రిత్రను క‌లిగి ఉన్న కుటుంబంలో జ‌న్మించింది. అద్భుతమైన భరతనాట్యం నర్తకిగాను పాపుల‌రైంది. న‌ర్త‌కిగా వృత్తిపరమైన జీవితంతో పాటు.. నటిగా తన కెరీర్ తో ప్ర‌పంచం దృష్టిని ఆకర్షించింది.

చాక్లెట్ బోయ్ సిద్ధార్థ్ తో డేటింగ్ చేస్తూ ఇప్పుడు ఇద్దరూ తరచుగా ఒకరితో ఒకరు బహిరంగంగా కనిపించ‌డం హాట్ టాపిక్ గా మారుతోంది. అజయ్ భూపతి 2021 దర్శకత్వం వహించిన మహాసముద్రంలో ఇద్దరూ కలిసి కనిపించినందున హైదరీ - సిద్ధార్థ్ తెరపై రొమాన్స్ ప‌రంగానూ చాలా మంది దృష్టిని ఆకర్షించారు. తాజా క‌థ‌నం ప్ర‌కారం... ఈ జోడీ సెట్ లో మంచి స్నేహితులయ్యారు. అప్పటి నుండి ఒకరినొకరు డేటింగ్ లో ఉన్నారు. ముంబైలోని ఒక సెలూన్ నుండి వీరిద్దరూ కలిసి బయటకు వస్తూ కనిపించిన తర్వాత వారి సంబంధం గురించి పుకార్లు వచ్చాయి. క‌థ‌నాలు వైర‌ల్ అయ్యాయి. ఈ జోడీ బయటకు వెళ్లినప్పుడు, స్టిల్ ఫోటోగ్రాఫ‌ర్లు సెలూన్ వెలుపల గుమిగూడి క్లిక్కుల‌తో హోరెత్తించారు. దీనిపై సిద్ధార్థ్ కోపం తెచ్చుకున్నాడు. ఫోటోలు తీయొద్ద‌ని ఫోటోగ్రాఫ‌ర్ల‌ను హెచ్చరించాడు.

ఈ సంవత్సరం ఏప్రిల్ 17 న సిద్ధార్థ్ పుట్టినరోజు సందర్భంగా అదితి హృదయపూర్వకంగా అత‌డికి ప్రేమ‌ సందేశం పంప‌గా.. వారి మ‌ధ్య‌ డేటింగ్ పుకార్లకు అది మరింత ఆజ్యం పోసింది. అదితి మాత్రమే కాదు.. సిద్ధార్థ్ కూడా అక్టోబర్ 27 న పుట్టినరోజు వేళ‌ తన ప్రియురాలితో కలిసి ఉన్న అద్భుత ఫోటోని పోస్ట్ చేసాడు. 'హృదయ యువరాణి' అంటూ ప్రేమ‌ను వ్య‌క్తం చేస్తూ వ్యాఖ్య‌ను జోడించాడు.

వయసు తేడా ఎంతంటే?

అదితి -సిద్ధార్థ్ మధ్య 7 సంవత్సరాల వయస్సు వ్యత్యాసం ఉంది. అదితి 28 అక్టోబర్ 1986న హిందుస్తానీ శాస్త్రీయ గాయని రచయిత విద్యారావు -ఎహసాన్ హైదరీ దంపతులకు హైదరాబాద్ లోని రాజకుటుంబంలో జన్మించగా.. సిద్ధార్థ్ చెన్నైలోని తమిళ కుటుంబంలో 17 ఏప్రిల్ 1979న జన్మించాడు.

విడాకుల క‌థ‌లు ఇంట్రెస్టింగ్ నిస్సందేహంగా ఈ జంట ఆఫ్-స్క్రీన్ కెమిస్ట్రీ ప‌రిశ్ర‌మ‌లో నిరంత‌రం చర్చనీయాంశంగా మారింది. ఈ జంట‌ను పెద్ద తెర‌పై చూసేందుకు అభిమానులు ఇష్టపడతారు. ఆ ఇద్ద‌రూ ఇత‌రుల‌తో అనుబంధాలు కొన‌సాగించ‌డం దే మొదటిసారి కాదు. ఇద్దరూ వేర్వేరు వ్యక్తులతో వివాహం చేసుకున్న గత చ‌రిత్ర‌ ఉంది. కానీ వ్యక్తిగత విభేదాల కారణంగా వారి వివాహాలు ఎక్కువ కాలం కొనసాగలేదు.

అదితి 2012లో 2012 క్రైమ్ థ్రిల్లర్ నో వన్ కిల్డ్ జెస్సికాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. నటుడు సత్యదీప్ మిశ్రాను 21 సంవత్సరాల చిన్న వయస్సులో వివాహం చేసుకుంది. 2007లో ఈ జంట వివాహ‌మైంది. 2013 లో విడిపోయింది. మరోవైపు సిద్ధార్థ్ తన చిన్ననాటి స్నేహితురాలు మీనాల్ ను నవంబర్ 2003లో వివాహం చేసుకున్నాడు. అతనికి కేవలం 24 సంవత్సరాలు అప్ప‌టికి. అయితే 2006 ప్రారంభంలో ఈ జంట విడివిడిగా నివసించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. తరువాత 2007లో విడాకులు తీసుకున్నారు. ప్ర‌స్తుతం అదితీతో సిద్ధార్థ్ స‌హ‌జీవ‌నం పెద్ద డిబేట్ గా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.