Begin typing your search above and press return to search.

వ‌య‌సు 50కి చేరువ‌వుతున్నా కానీ..!

By:  Tupaki Desk   |   29 Oct 2021 7:16 AM GMT
వ‌య‌సు 50కి చేరువ‌వుతున్నా కానీ..!
X
కొందరికి వ‌య‌సుతో ప‌ని లేదు. 50కి చేరువ‌వుతున్నా మ‌న‌సు 20 ద‌గ్గ‌రే ఆగిపోతోంది! ఇదే కోవ‌కు చెందుతుంది ది గ్రేట్ మ‌లైకా అరోరా. వ‌య‌సు 48 దాటినా.. ఇంకా టీనేజీ మిస‌మిస‌ల‌తో ఎన‌ర్జిటిక్ గా క‌నిపిస్తోంది ఈ సీనియ‌ర్ న‌టి. ఆ అందానికి 30 ప్ల‌స్ కుర్రాడు త‌న‌వెంట పడ్డాడంటే అర్థం చేసుకోవాలి. మ‌లైకా నిరంత‌రం జిమ్ యోగా అంటూ త‌న రూపాన్ని కాపాడుకునేందుకు ఎంత‌గా శ్ర‌మిస్తుందో కూడా చెప్పాల్సిన ప‌నే లేదు. ప్ర‌స్తుతం త‌న‌ ఇన్ స్టా వేదిక‌గా ఉచిత యోగా క్లాసులు చెబుతున్నారు. నిరంత‌రం జిమ్ యోగా కు సంబంధించిన ఫోటోలు వీడియోలతో అభిమానుల‌కు బోలెడంత మార్గ‌నిర్ధేశ‌నం చేస్తున్నారు. ఇటీవ‌ల ఓ ప్ర‌ముఖ యోగా సంస్థ‌తో క‌లిసి స్పెష‌ల్ క్లాసుల్ని ఉచితంగానే అందిస్తున్నారు.

అలాగే ముంబైలో మ‌లైకా జాగింగ్ ఫోటోలు వీడియోలతో పాటు త‌న క‌జిన్స్ ని బంధువుల‌ను క‌లిసేందుకు వెళ్లేప్ప‌టి ఫోటోలు ఇటీవ‌ల వైర‌ల్ గా మారుతున్నాయి. తాజాగా త‌న మ‌ద‌ర్ ఇంటికి వెళుతున్న ఫోటోషూట్ ఒక‌టి తాజాగా అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. ఈ ఫోటోగ్రాఫ్స్ లో ప‌ర్ఫెక్ట్ ఫిజిక్ ప‌ర్ఫెక్ట్ ఫిట్నెస్ తో మలైకా క‌నిపిస్తోంది.

మలైకా అరోరా లేటెస్ట్ లుక్ లో నీలిరంగు దుస్తులలో అబ్బురపరిచింది. తన తల్లి నివాసం వెలుపల ఇలా అందమైన నీలిరంగు దుస్తులలో కనిపించింది. బాడీ హగ్గింగ్ డ్రెస్ .. ప్రముఖంగా టోన్ చేసిన శ‌రీరాకృతితో మ‌తులు చెద‌ర‌గొట్టింది. మ‌లైకా టాన్డ్ స్కిన్ ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తోంది. ఎప్పటిలాగే మాస్క్ ధ‌రించ‌డం మ‌ర్చిపోలేదు. కోవిడ్ తీవ్ర‌త త‌గ్గినా కానీ.. అన్నిర‌కాలా సామాజిక దూర మార్గదర్శకాలను పాటిస్తూ క‌నిపించింది. ప్ర‌స్తుతం మ‌లైకా స్పెష‌ల్ లుక్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. బాలీవుడ్ లోని అత్యంత ఫిట్టెస్ట్ డ్యాన్స‌ర్ గా త‌న‌దైన‌ అందంతో మ‌లైకా మ‌త్తు చ‌ల్లుతోంది. అలాగే నేటిత‌రానికి ఫ్యాషన్ లక్ష్యాలను నిర్దేశించడాన్ని ఈ సీనియ‌ర్ ఫ్యాష‌నిస్టా కొనసాగిస్తున్నారు. మ‌లైకాకు సినిమాల్లో అవ‌కాశాలు లేక‌పోయినా.. ప్ర‌స్తుతం డ్యాన్స్ రియాలిటీ షోల‌కు జ‌డ్జిగా కొన‌సాగుతూనే వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల ద్వారా ఫ్యాష‌న్ ర్యాంప్ షోల ద్వారా భారీ ఆదాయాన్ని ఆర్జిస్తున్న సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లోనే త‌న‌యుడిని మ‌లైకా హీరోని చేసేందుకు స‌న్నాహ‌కాల్లో ఉన్నార‌ని స‌మాచారం.