Begin typing your search above and press return to search.
ది అమెరికన్ డ్రీమ్' టీజర్: డాలర్ల కోసం దేశం దాటిన కుర్రాడి కథ..!
By: Tupaki Desk | 14 Dec 2021 7:31 AM GMTతెలుగు ప్రేక్షకులకు 100 శాతం వినోదాన్ని అందించే లక్ష్యంగా డిజిటల్ వరల్డ్ లోకి వచ్చిన 'ఆహా' ఓటీటీ.. ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ తో వీక్షకులను ఆకట్టుకుంటోంది. బ్లాక్ బస్టర్ సినిమాలు - డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ లతో పాటుగా స్పెషల్ టాక్ షోలు - ఒరిజినల్ వెబ్ సిరీసులను స్ట్రీమింగ్ చేస్తూ సబ్ స్క్రైబర్స్ పెంచుకుంటూ పోతోంది. ఈ క్రమంలో ఇప్పుడు ''ది అమెరికన్ డ్రీమ్'' అనే మరో ఇంట్రెస్టింగ్ ఒరిజినల్ తో ముందుకు వస్తోంది.
''ది అమెరికన్ డ్రీమ్'' వెబ్ సిరీస్ లో ప్రిన్స్ ప్రధాన పాత్ర పోషించారు. డబ్బులు సంపాదించాలనే లక్ష్యంతో అమెరికాకు వెళ్లిన ఓ యువకుడు అక్కడ ఎలాంటి కష్టాలు పడ్డాడు? ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నాడు? అనే అంశాలతో ఈ ఒరిజినల్ ని రూపొందించారు. తాజాగా దీనికి సంబంధించిన టీజర్ ను ఆహా టీమ్ విడుదల చేసింది.
'డాలర్ల కోసం దేశం దాటిన వారిలో నేనొకడిని' అంటూ ప్రిన్స్ సిసిల్ చెప్పే డైలాగ్ తో ప్రారంభమైన ఈ టీజర్ ఆద్యంతం హాస్యభరితంగా ఆసక్తికరంగా సాగింది. యూఎస్ఏలో పని చేయాలని కలలు కనే యువకుడిగా ప్రిన్స్ ఆకట్టుకున్నాడు. రికమెండేషన్ తో అక్కడ బాత్ రూమ్ లు కడిగే జాబ్ సంపాదించడం.. బ్రతుకు దెరువు కోసం అన్ని రకాల పనులు చేయడం వంటివి నవ్వు తెప్పిస్తున్నాయి.
ఇదే క్రమంలో తనకు ఎలాంటి రిలేషన్ షిప్స్ వద్దు అని అనుకునే ఓ అమ్మాయి ప్రిన్స్ లైఫ్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది. 'అమెరికాలో స్థిరపడాలంటే ముక్కు మూసుకొని దొరికిన పనల్లా చేసుకొని పోవడమే..' అని చెప్పడంతో ఈ సిరీస్ నేపథ్యం ఏంటో అర్థం అవుతుంది. అయితే డాలర్ల కోసం అమెరికాకు వెళ్లకూడదని ప్రిన్స్ చివరకు రియలైజ్ అయినట్లు టీజర్ లో చూపించారు.
డబ్బు సంపాదన కోసం దేశం దాటిన ఈ కుర్రాడి పూర్తి కథ ఏంటో తెలియాలంటే ''ది అమెరికన్ డ్రీమ్'' సిరీస్ రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే. విఘ్నేశ్ కౌశిక్ ఈ ఒరిజినల్ కు దర్శకత్వం వహించగా.. ప్రదీప్ రెడ్డి నిర్మించారు. అభినయ్ మ్యూజిక్ కంపోజ్ చేయగా.. ఆడమ్ చంపాన్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు. శశాంక్ ఎడిటింగ్ వర్క్ చేశారు.

'ది అమెరికన్ డ్రీమ్' లో నేహా కృష్ణ - శుభలేఖ సుధాకర్ - రవితేజ ముక్కవల్లి - శ్రీ మిరాజ్ కర్ - ఫణి రాంపల్లి - అనిల్ శంకరమంచ్ - మురళీధర్ - శ్రీ రాంరెడ్డి ఆసిరెడ్డి - రవికుమార్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఆహా ఓటీటీలో క్రిస్మస్ సందర్భంగా ఈ ఒరిజినల్ ను స్ట్రీమింగ్ చేయనున్నారు.