Begin typing your search above and press return to search.
ట్రైలర్ టాక్ : అమెరికా అసలు రంగేంటో అర్థమైంది
By: Tupaki Desk | 7 Jan 2022 1:12 PM GMT`ఆహా` ఓటీటీ ప్లాట్ ఫామ్ వినోదానికి కేరాఫ్ అడ్రస్ గా మారింది. వరుస సినిమాలు, రియాలీటి షోలు, టాక్ షోలతో ఆకట్టుకుంటూనే `ఆహా`ఒరిజినల్స్ పేరుతో కొత్త తరహా చిత్రాలని ఎంకరేజ్ చేస్తూ వాటిని ప్రేక్షకులకు అందిస్తోంది. తాజాగా `ఆహా` మరో కొత్త మూవీని అందించబోతోంది. అదే `ది అమెరికన్ డ్రీమ్`. చాలా మంది ఇంజినీరింగ్ స్టూడెంట్ లకు, సాఫ్ట్ వేర్ లకు అమెరికాలో పెద్ద జాబ్ సంపాదించేసి అక్కడే సెటిల్ అవ్వాలని బిగ్ డ్రీమ్.
అలాంటి డ్రీమ్ తో కోటి ఆశలతో అమెరికాలో ల్యాండ్ అయిన ఓ తెలుగు కుర్రాడు ఎదుర్కొన్న సమస్యల, ఆటుపోట్ల నేపథ్యంలో రూపొందించిన ఒరిజినల్ వెబ్ మూవీ `ది అమెరికన్ డ్రీమ్`. ప్రిన్స్ హీరోగా నటించాడు. నేహా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని డాక్టర్ ప్రదీప్ రెడ్డి నిర్మించారు. డాక్టర్ విఘ్నేష్ కౌశిక్ రూపొందించారు. శుక్రవారం ఈ మూవీ ట్రైలర్ ని ఆహా విడుదల చేసింది. `క్లైమాక్స్ లో రావాల్సిన ట్విస్ట్ ఇది. కథ స్టార్టింగ్ లోనే వచ్చింది.
ఆశగా వచ్చిన నాకు అమెరికా అసలు రంగేంటో అర్థమైంది` అంటూ ప్రిన్స్ వాయిస్‌లో ట్రైలర్ మొదలైంది. ఈ చిన్న డైలాగ్ తోనే ఈ సినిమా ఎలా వుండబోతోంది? .. ఆశగా అమెరికాలో అడుగుపెట్టిన ఓ యువకుడు ఎదుర్కొన్న సవాళ్లేంటన్నది స్పష్టం చేసింది. నెలంతా పని చేసినా సాలరీ రాకపోవడం.. అక్కడ కంటిన్యూ అవ్వడానికి తిరిగి తండ్రినే డబ్బు పంపించమని హీరో అడగడం.. జాబ్ పేరుతో జరిగే హంగామా.. ఆ తరువాత ఏర్పడే ఇబ్బందులు కళ్లకు కట్టినట్టుగా చూపించాడు దర్శకుడు.
అంతే కాకుండా అక్కడి రిలేషన్ షిప్ ల పైన కూడా సెటైర్ వేసినట్టుగా కనిపిస్తోంది. కమిట్‌మెంట్ కి సిద్ధమైన యువతితో ప్రేమలో పడటం.. పెళ్లి తనకు ఇష్టం లేదని హీరోయిన్ చెప్పడం.. అనుకోకుండా హీరో ఓ యాక్సిడెంట్ చేయడం... దాని వల్ల అతని జీవితం మరో మలుపు తిరగడం వంటి ఆసక్తికర సన్నివేశాలతో దర్శకుడు ఓ తెలుగు యువకుడి అమెరికా కష్టాలని చూపించే ప్రయత్నం చేశాడు.
అమెరికా పేరుతో ఇంజనీరింగ్ స్టూడెంట్స్, సాఫ్ట్ వేర్ లు వెళ్లి అక్కడ సరైన జాబ్ లభించక ఎలాంటి దుర్భరమైన లైఫ్ ని లీడ్ చేస్తున్నారో `ది అమెరికన్ డ్రీమ్`లో చూపించారు. యూత్‌ని ఆకట్టుకునే అంశాలతో రూపొందిన ఈ మూవీ `ఆహా` ఓటీటీలో జనవరి 14న స్ట్రీమింగ్ కాబోతోంది.