Begin typing your search above and press return to search.

కాకాహోటల్ తో అనుబంధం ఇప్పటిది కాదు: స్టార్ హీరోయిన్

By:  Tupaki Desk   |   15 Feb 2021 4:30 PM GMT
కాకాహోటల్ తో అనుబంధం ఇప్పటిది కాదు: స్టార్ హీరోయిన్
X
సౌత్ ఇండియన్ ఫేవరేట్ హీరోయిన్లలో ఒకరైన కాజల్ అగర్వాల్ ఏం చేసినా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటుంది. కాజల్ పెళ్లి అయినప్పటి నుండి భర్తతో ఎంచక్కా చెట్టాపట్టాలేసుకొని తన ఫేవరేట్ ప్లేసెస్ అన్ని చక్కర్లు కొడుతోంది. హనీమూన్ కోసం మాల్దీవ్స్ కెళ్లిన టాలీవుడ్ చందమామ తాజాగా నచ్చిన ఫుడ్ కోసం పొలాచ్చికి వెళ్లిందట.

హనీమూన్ కోసమే దాదాపు ఐదు కోట్లరూపాయల వరకు ఖర్చు చేశారట ఈ కపుల్. అండర్ వాటర్ మురాకలో ఎంతో అందమైన చేపల వ్యూలో హ్యాపీగా ఎంజాయ్ చేశారట. హనీమూన్ విషయం పక్కన పెడితే వాలంటైన్స్ డే రోజున భర్త గౌతమ్ కిచ్లుతో కలిసి ఓ సాధారణ హోటల్ కి వెళ్ళింది. ప్రస్తుతం ఈ టాపిక్ సోషల్ మీడియా మొత్తం హల్చల్ చేస్తోంది.

పొలాచ్చిలో శాంతి మెస్ అనే ఓ సాధారణ హోటల్. ఆ హోటల్ లో తన పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకొని డిన్నర్ లాగిచ్చేసింది కాజల్. దాదాపు తొమ్మిది ఏళ్ళుగా ఆ హోటల్ తో అనుబంధం ఉందని చెబుతోంది. అక్కడికి వెళ్లిన ఫోటోస్ కూడా షేర్ చేసి అసలు స్టోరీ ఏంటో చెప్పింది. పొలాచ్చిలో శాంతి మెస్ నా ఫేవరేట్. ఇక్కడ ఓనర్స్ శాంతి, బాలకుమార్ మాకు ప్రేమగా భోజనం వడ్డించారు. అందుకే వారు హోటల్ పెట్టినప్పటి నుండి సక్సెస్ గా రన్ అవుతుంది.

అలాగే భోజనం ఎంతో రుచికరంగా ఉందంటూ చెప్పుకొచ్చింది కాజల్. ఓ కాకా హోటల్ గురించి కాజల్ పోస్ట్ చేయడం ఆనందంగా ఉందంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు నేటిజన్లు. ఇదిలా ఉండగా కాజల్ ప్రస్తుతం మెగాస్టార్ సరసన ఆచార్య సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా మే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే కమల్ హాసన్ తో ఇండియన్-2 మూవీ చేస్తోంది. తాజాగా లైవ్ టెలికాస్ట్ అనే వెబ్ సిరీస్ కూడా చేసింది. మొత్తానికి ఫుల్ స్వింగ్ లో ఉంది కాజల్.