Begin typing your search above and press return to search.
ఆర్టిస్ట్ మళ్లీ డైరెక్షన్ లోకి వచ్చేశాడు!
By: Tupaki Desk | 18 Nov 2022 8:29 AM GMTరౌడీ స్టార్ విజయ్ దేవరకొండని హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కిన ఈ మూవీ 'పెళ్లి చూపులు'. ఈ మూవీతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు యంగ్ అండ్ టాలెంటెడ్ తరుణ్ భాస్కర్. తొలి చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడమే కాకుండా దర్శకుడిగా తరుణ్ భాస్కర్ కు మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. జాతీయ స్థాయిలో అవార్డుల్ని సైతం అందించిన తరుణ్ భాస్కర్ ని దర్శకుడిగా మరింత పాపులర్ అయ్యేలా చేసింది. ఈ మూవీ తరువాత కొంత విరామం తీసుకున్నారు తరుణ్ భాస్కర్.
రెండేళ్ల విరామం తరువాత మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తో 'ఈ నగరానికి ఏమైంది' అంటూ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. నెట్ ఫ్లిక్స్ కోసం ముగ్గురు దర్శకులు కలిసి చేసిన అంథాలజీ 'పిట్టకథలు'లోని రాముల సెగ్మెంట్ కు తరుణ్ దర్శకత్వం వహించాడు. ఇక 'మీకు మాత్రమే చెప్తా' సినిమాతో ఆర్టిస్ట్ గా మెయిన్ లీడ్ గా నటించి ఈ మూవీకి మాటలు అందించాడు. శర్వా ఒకే ఒక జీవితం, విశ్వక్ సేన్ 'ఓరి దేవుడా' వంటి సినిమాలకు మాటలు అందించాడు.
మహానటి, సమ్మోహనం, ఫలక్ నుమా దాస్, మిడిల్ క్లాస్ మెలోడీస్, స్కైలాబ్, సీతారామం వంటి సినిమాల్లో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చాడు. నటుడిగా, రైటర్‌గా, డైరెక్టర్ గా తన ప్రతిభని చాటుకుంటున్నాడు. అయితే మళ్లీ మూడున్నరేళ్ల విరామం తరువాత మెగా ఫోన్ పడుతూ డైరెక్షన్ లోకి వచ్చేశాడు. ఇతర సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ, మాటలు అందిస్తున్న తరుణ్ భాస్కర్ డైరెక్టర్ గా తన ఆల్ రౌండర్ ప్రతిభను కనబరుస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు. దాదాపు మూడున్నరేళ్ల విరామం తరువాత తరుణ్ భాస్కర్ మళ్లీ డైరెక్షన్ చేస్తున్న లేటెస్ట్ మూవీ 'కీడా కోలా'.
వీజీ సైన్మా, క్విక్ ఫాక్స్.. బ్యానర్ ల పై ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. 'కీడా కోలా' భారీ కాంట్రవర్శియల్ సబ్జెక్ట్ నే తరుణ్ భాస్కర్ ఈ మూవీతో డీల్ చేయబోతున్నట్టుగా స్పష్టమవుతోంది. బాటిల్ డక్కన్.. రక్తం చిమ్ముతున్న బొద్దంకని టైటిల్ లో చూపించిన తీరుని బట్టి తరుణ్ భాస్కర్ ఈ సారి కూల్ డ్రింక్స్ (సీతల పానియాల)ని టార్గెట్ చేస్తూ ఈ మూవీని సంచలన కథనంతో తెరపైకి తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తోంది.
తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ కానున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 18న శుక్రవారం మొదలైంది. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాని 2023 లో ఐదు భాషల్లో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయబోతున్నారట. ఈ మూవీతో అయినా తరుణ్ భాస్క్ మళ్లీ గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తాడో మళ్లీ గ్యాప్ ఇస్తాడో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.