Begin typing your search above and press return to search.
బాహుబలి.. ఆ ఎక్స్ పీరియన్స్ అదిరింది
By: Tupaki Desk | 23 Oct 2016 11:17 AM GMTబాహుబలి ది కంక్లూజన్ కి ఫస్ట్ లుక్ ఆవిష్కరించడంతో పాటే మరిన్ని సెన్సేషన్స్ కు నాంది పలికింది జక్కన్న అండ్ కో. టెక్నాలజీ బేస్ చేసుకుని తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించి.. ఓ కొత్త టెక్నాలజీని జనాలకు కూడా అందుబాటులోకి తెచ్చారు. కమర్షియల్ యాంగిల్ లోనే పరిచయం చేసినా.. బాహుబలి వీఆర్ ఎక్స్ పీరియన్స్ మాత్రం.. జనాలకు బోలెడంత థ్రిల్ కలిగించే విషయమే.
ఏఎండీ రాడాన్ టెక్నాలజీస్ గ్రూప్ క్రియేట్ చేసిన వర్చువల్ రియాలిటీ ఎక్స్ పీరియన్స్ ద్వారా.. బాహుబలి ది కంక్లూజన్ సెట్స్ లోకి ప్రయాణం చేయచ్చు. కాకపోతే వీఆర్ హెడ్ సెట్స్ తో అద్భుతమైన లోకం లోకి ప్రయాణించచ్చన్నది యూనిట్ చెబుతున్న మాట. ఇందుకోసం ఇప్పటికే వీఆర్ కార్డ్ బోర్డ్ లను కూడా విక్రయిస్తున్నారు. ఈ హెడ్ సెట్స్ ద్వారా చూడాల్సిన వీడియోలను బాహుబలి యూనిట్ షేర్ చేస్తుంది. మొదటి వీడియోను స్వయంగా బాహుబలి ప్రభాస్ తన ఫేస్ బుక్ పేజ్ ద్వారా పంచుకున్నాడు. 'డార్లింగ్స్.. వీఆర్ ఎక్స్ పీరియన్స్ ద్వారా బాహుబలి2 సెట్స్ లోకి ఓ ట్రిప్ వేయండి. వీలైనంత ఎక్కువ బ్యాండ్ విడ్త్ తో వీఆర్ హెడ్ సెట్స్ ను ఉపయోగించి చూడ్డ ద్వారా వర్చువల్ రియాలిటీ అనుభవించండి' అని చెబుతున్నాడు.
ఈ వీడియోలో మొదట రాజమౌళి మనకు ప్యాలెస్ ను చూపిస్తూ.. డీటైలింగ్ ఇస్తాడు. ఆ తర్వాత దేవసేన అనుష్క.. తనను పాతికేళ్లు కట్టిపడేసిన ప్లేస్ ను చూపించి మరిన్ని వివరాలు చెబుతుంది. ఇక కట్టప్ప అయితే.. మొత్తం ఆ ఏరియా అంతా పరిగెడుతూ కూడా వర్చువల్ రియాలిటీ ఎక్స్ పీరియన్స్ ను పక్కాగా వాడేశాడు. చివరగా వచ్చిన బాహుబలి.. కాసిన్ని ఇంట్రెస్టింగ్ డీటైల్స్ ఇస్తూ.. చివరకు జై మాహిష్మతీ అంటూ ముగిస్తాడు. ఈ వీడియోను వర్చువల్ రియాలిటీ లో అనుభవించాక.. జై మాహిష్మతి కంటే.. జై టెక్నాలజీ అనాల్సిందే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/