Begin typing your search above and press return to search.

కబాలి కే సవాలు విసురుతున్న బాహుబలి

By:  Tupaki Desk   |   2 July 2016 10:14 AM IST
కబాలి కే సవాలు విసురుతున్న బాహుబలి
X
అబ్బే బాహుబలి అంటే మన బాహుబలి కాదండోయ్‌. ఈ బాహుబలి రేంజ్ అండ్ స్టామినా వేరు. ఇతగాడు మన బాహుబలి కంటే 100 రెట్లు పెద్దోడు. ఏయ్ కబాలి అంటే చిన్న సినిమాలు భయపడ్డాయ్‌.. కబాలి రా.. అనాగానే పెద్ద సినిమాలు తప్పుకున్నాయి. కాని ఇలాంటి కబాలి లు ఎంతమంది వచ్చినా కూడా ఈ 'బిగ్‌ ఫ్రెండ్లీ జయింట్‌' మాత్రం తప్పుకోడు. అతడు చెప్పిన టైముకే దిగుతున్నాడు.

డిస్నీ మరియు రిలయన్స్ కలసి.. ప్రఖ్యాత లెజండరీ స్టీవెన్ స్పీల్బర్గ్ దర్శకత్వంలో రూపొందించిన సినిమా ''ది బి.ఎఫ్‌.జి''. ఎమోషనల్ గా సాగే ఈ స్టోరీలైన్ లో.. మామూలు మనుషులు గెలివర్స్ ట్రావెల్స్ లోని లిల్లీపుట్ల సైజులో ఉంటే.. ఈ ముసలాయన మాత్రం ఏకంగా గెలివర్‌ అంత హైటులో ఉంటాడు. అయితే ఒక చిన్న పిల్లకు ఈ పెద్ద ముసలాయనకూ మధ్యన ఎలాంటి కథ నడించింది అనే విషయం మన తెరమీద చూడాలి. ఈ విజువల్ ఎఫెక్ట్స్ డ్రామా జూలై 15న విడుదలవుతోంది. అంటే సరిగ్గా ''కబాలి'' కోసం ఫిక్స్ చేసిన స్లాట్‌ లోనే. ఇండియాలో ఇంగ్లీష్‌ - తెలుగు - తమిళ్‌ - హిందీ బాషల్లో 3డి వర్షెన్‌ వచ్చేస్తోంది. అసలే హాలీవుడ్‌ సినిమాలు ఇక్కడ దుమ్ము లేపేస్తున్న వేళ.. ఇప్పుడు ఏకంగా స్పీల్బర్గ్ సినిమా అంటే.. మన లోకల్‌ సినిమాలకు కూడా జిల్‌ అంటోంది మరి.

ఇకపోతే ఈ సినిమా తెలుగు వర్షన్‌ కు ఉన్న ప్రత్యేకత ఏంటంటే.. స్వయంగా మన జగ్గూ బాయ్‌.. అదేనండీ మన జగపతి బాబు ఆ ముసలాయనకు తెలుగు వాయిస్ అందించాడు. ఇక చూస్కోండి... ది BFG రా.. అంటున్నారు జనాలు.