Begin typing your search above and press return to search.
వర్షంలో వెయిట్ చేయించి దర్శకుడిని అవమానించిన పెద్ద హీరో
By: Tupaki Desk | 20 July 2021 9:01 AM GMTటాలీవుడ్ కి ఎంతో ట్యాలెంట్ వస్తుంటుంది. అందులో కొందరికే అవకాశాలుంటాయి. ఆ కొందరు కూడా ఒక్క ఛాన్స్ ప్లీజ్! అంటూ ఎందరినో బతిమలాడాల్సి ఉంటుంది. నేరుగా రాజమార్గంలో అవకాశం రావడం అన్నది ఇక్కడ చాలా అరుదు. ఇంతకుముందు దర్శకుడు ప్రశాంత్ వర్మ అసిస్టెంట్ డైరెక్టర్ గా ప్రయత్నాల్లో ఉన్నప్పుడు తన కష్టాలన్నీ ఏకరువు పెట్టాడు.
ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్లకు గౌరవం ఉండదని చాలా వేచి చూడాల్సి ఉంటుందని తెలిపారు. తనతో ఓ దర్శకుడు మంచినీళ్ల బాటిల్ కూడా తెప్పించుకున్నాడట. విద్యలో రాష్ట్ర స్థాయి టాపర్ అయిన తాను జిల్లా స్థాయి క్రీడాకారుడిని అని కూడా వెల్లడించారు.
దర్శకత్వం కోసం ప్రయత్నించే క్రమంలో ఓ సీనియర్ హీరో ఇంటికి వెళితే.. తనని గేట్ వద్దనే వెయిట్ చేయమన్నారట. ఆ సమయంలో వర్షం రావడంతో తడుస్తూ వేచి చూసానని అయితే తాను తడుస్తుంటే మేడ పైనుంచి ఆ హీరో తననే చూస్తూ ఉన్నారని కూడా తెలిపాడు. ఫోన్ చేసినా ఆయన వెయిట్ చేయించాడని కూడా ఆవేదన చెందారు. మొత్తానికి ఈ ఎపిసోడ్ లో తనని వెయిట్ చేయించిన సీనియర్ హీరో ఎవరో కానీ... ప్రశాంత్ వర్మ ఇప్పటికి అ! - కల్కి- జాంబీ రెడ్డి చిత్రాల్ని తెరకెక్కించారు.
అన్నట్టు పరిశ్రమలో అసిస్టెంట్లు ఘోస్ట్ ల పరిస్థితి ఎప్పుడూ ఇలానే ఉంటుంది. సీనియర్లకు వ్యక్తిగత చాకిరీ చేసి ఇంటి పని ఒంటి పని చేశాకే అవకాశాలిస్తుంటారు. బార్ కి వెళ్లి మందు తెచ్చి సోడా కలిపిన చాలా మంది ఔత్సాహికులు పరిశ్రమలో ఉన్నారు. ప్రశాంత్ వర్మకు ఎదురైన సన్నివేశం ఎందరికో ఎదురైనదే. కొన్నిసార్లు పేషెన్స్ టెస్టుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.