Begin typing your search above and press return to search.

కపూర్ ఫ్యామిలీలో అతి పెద్ద వేడుక‌!

By:  Tupaki Desk   |   12 July 2022 2:30 PM GMT
కపూర్ ఫ్యామిలీలో అతి పెద్ద వేడుక‌!
X
ప్ర‌స్తుతం కపూర్ ఫ్యామిలీ క్లౌడ్ నైన్ లో ఉంది. బాలీవుడ్ స్టార్ హీరో అనీల్ క‌పూర్ తాత కాబోతున్నాడు. క‌పూర్ గారాల కుమార్తె సోనమ్ కపూర్ భర్త ఆనంద్ అహుజాతో తన మొదటి బిడ్డను ఆశిస్తున్నారు.

ఫ్రెగ్నెన్సీ ప్ర‌క‌ట‌న అనంత‌రం సోనమ్ కపూర్ -అహుజా జూన్ చివరలో లండన్ లో తన సన్నిహితుల స‌మ‌క్షంలో బేబీ షవర్ వేడుకను నిర్వ‌హించింది. తాజా స‌మాచారం మేర‌కు ముంబైలో మ‌రో ఘ‌న‌మైన ఈవెంట్ ని క‌పూర్ ఫ్యామిలీ ప్లాన్ చేసింది. సోనమ్ కపూర్ తల్లిదండ్రులు అనిల్ కపూర్ & సునీతా కపూర్ లు బాంద్రాలోని రాక్ డేల్ (సోనమ్ మాసి కవితా సింగ్ బంగ్లా)లో గ్రాండ్ బేబీ షవర్ ను నిర్వహించనున్నారు.

కుమార్తె సోనమ్ కపూర్ అహూజా కోసం ఈ వేడుక‌ను వైభ‌వంగా నిర్వహిస్తారని కపూర్ కుటుంబ‌ సన్నిహితులు వెల్ల‌డించారు. ఈ ఈవెంట్ భారీ తార‌ల న‌డుమ ఘ‌నంగా సాగ‌నుంద‌ని తెలిసింది.

ఈవెంట్ కి బాలీవుడ్ నుంచి ఎవరు హాజరవుతారో అంచ‌నా వేస్తున్నారు. జాన్వీ కపూర్- ఖుషీ కపూర్- షానాయ కపూర్- అన్షులా కపూర్- అర్జున్ కపూర్ - మోహిత్ మార్వా కుటుంబంతో పాటు.. స్వరా భాస్కర్- కరీనా కపూర్ ఖాన్- కరిష్మా కపూర్- అమృతా అరోరా- మలైకా అరోరా- అలియా భట్- నటాషా ఫెర్నాండ్- జాక్- దీపికా పదుకొణె- మసాబా గుప్తా- రాణి ముఖర్జీ కూడా ఈ ఫంక్షన్ కి రావడం ఖాయం.

సోనమ్ కపూర్ .. ఆనంద్ అహూజా వివాహం 2018లో జరిగింది. అతిపెద్ద బాలీవుడ్ వివాహాలలో ఇది ఒకటి. సోన‌మ్ త్వరలో మాతృత్వాన్ని స్వీకరించబోతున్నందున కుటుంబంతో ఈవెంట్ ని గ్రాండ్ గా ప్లాన్ చేయ‌డం ఉత్కంఠ క‌లిగిస్తోంది. బాలీవుడ్ అగ్ర తారలందరూ ఈ వేడుక‌కు ఎటెండ‌వుతుండ‌డం మ‌రో ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ కానుంది.

ఆస‌క్తిక‌రంగా క‌పూర్ హీరోయిన్లంద‌రూ ఈ వేడుక‌లో చిక్కుతారని అభిమానులు భావిస్తున్నారు. క‌పూర్ కుటుంబం నుంచి దాదాపు అర‌డ‌జ‌ను మంది బాలీవుడ్ లో కెరీర్ ని సాగిస్తున్న సంగ‌తి తెలిసిందే. కొంద‌రు డెబ్యూలుగా బ‌రిలో ఉన్నారు.