Begin typing your search above and press return to search.

ప్రాజెక్ట్ K నుంచి రాబోతున్న అతిపెద్ద అప్డేట్..!

By:  Tupaki Desk   |   25 Dec 2022 11:30 PM GMT
ప్రాజెక్ట్ K నుంచి రాబోతున్న అతిపెద్ద అప్డేట్..!
X
వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వనిదత్ తర్వాత ఆ నిర్మాణ సంస్థలో వరుస సినిమాలు చేస్తూ వస్తున్నారు అశ్వనిదత్ తనయురాళ్లు స్వప్న దత్, ప్రియాంక దత్. స్వప్న దత్ నిర్మాతగా తన ప్రతిభను చూపిస్తుంది. ఆమె స్పెషల్ కేర్ తోనే మహానటి, సీతారామం సినిమాలు అద్భుతంగా వచ్చాయి. ప్రభాస్ తో చేస్తున్న ప్రాజెక్ట్ K సినిమా మీద పూర్తి ఫోకస్ తో పనిచేస్తున్నారు.

ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ఇచ్చారు నిర్మాత స్వప్న దత్. త్వరలోనే ప్రాజెక్ట్ Kకి సంబంధించిన ఒక అప్డేట్ వస్తుందని అన్నారు. నాగ్ అశ్విన్ త్వరలో అదేంటి అన్నది చెబుతారని అన్నారు.

తన ట్విట్టర్ స్పేస్ లో వచ్చిన స్వప్న దత్ ప్రాజెక్ట్ K గురించి త్వరలో ఒక బిగ్ ఎనౌన్స్ మెంట్ వస్తుందని. తప్పకుండా అందరు ఊహించిన దాని కన్నా చాలా పెద్దగా ఉంటుందని అన్నారు స్వప్న దత్. 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కె సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ భామలు దీపిక పదుకొనె, దిశా పటాని నటిస్తున్నారు.

బిగ్ బి అమితాబ్ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నారు. సినిమాలో వి.ఎఫ్.ఎక్స్ చాలా అద్భుతంగా ఉంటాయని తెలుస్తుంది. ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్నారు.

2023 లో ఈ సినిమా రిలీజ్ అంటున్నా అది సాధ్యమయ్యే పని కాదని ఫ్యాన్స్ అంటున్నారు. ప్రభాస్ ఈ సినిమాతో పాటుగా సలార్, రాజా డీలక్స్ సినిమాలు చేస్తున్నాడు. 2023 ప్రభాస్ ఫ్యాన్స్ కి సంథింగ్ స్పెషల్ అని చెప్పొచ్చు.

మహానటితోనే దర్శకుడిగా తన టాలెంట్ ఏంటో చూపించిన నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కె తో వరల్డ్ వైడ్ గా తన సత్తా చాటనున్నాడు. బాహుబలితో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ కాగా.. ప్రాజెక్ట్ కె తో పాన్ వరల్డ్ స్టార్ గా మారడం పక్కా అని అంటున్నారు. ప్రాజెక్ట్ కె సినిమాని ఎక్కడ కాంప్రమైజ్ అవకుండా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. సినిమా నుంచి మొన్నామధ్య వచ్చిన ప్రీ లుక్ పోస్టర్ అదిరిపోయింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.