Begin typing your search above and press return to search.
హిందీ 'జెర్సీ'కి అన్ని విఘ్నాలు తొలగినట్టేనా?
By: Tupaki Desk | 14 April 2022 3:44 AM GMTసినిమా కాపీరైట్ కు సంబంధించి చట్టపరమైన అడ్డంకులను ఎదుర్కొంటున్నందున గత కొంతకాలంగా 'జెర్సీ-హిందీ' వెర్షన్ హాట్ టాపిక్ గా మారింది. రిలీజ్ పై ప్రముఖ రచయిత స్టే కోరడంతో డైలమా కొనసాగగా.. తాజా సమాచారం మేరకు నిర్మాతలకు కోర్టు వైపు నుంచి ఉపశమనం లభించింది.
ఈ వారం బాంబే హైకోర్టులో కేసు వల్ల విచారణ జరుగుతోందని తెలియగానే మేకర్స్ సినిమాను వారం పాటు అంటే.. ఏప్రిల్ 22కి వాయిదా వేశారు. అయితే చివరి నిమిషం వరకూ దేనినీ విడిచిపెట్టాలని నిర్మాతలు అనుకోలేదు. చివరి నిమిషంలో వారు సినిమా విడుదలను ప్లాన్ చేయడానికి ముందే కోర్టు నుండి అనుకూలమైన ఉత్తర్వు పొందాలని నిర్ణయించుకున్నారు.
ఎట్టకేలకు తాజా తీర్పులో షాహిద్ కపూర్ చిత్రం జెర్సీపై స్టేను బాంబే హైకోర్టు తిరస్కరించింది. ఏప్రిల్ 22న విడుదల ఖాయమైంది. నిజానికి రచయిత రజనీష్ జైస్వాల్ ఈ సినిమా కథ నిజానికి తనదేనని పేర్కొంటూ నిర్మాతలపై బాంబే హైకోర్టులో కేసు వేశారు. కానీ అది వీగిపోయింది.
ఈ మూవీ నిర్మాత అమన్ గిల్ మాట్లాడుతూ- "మేమంతా మా సినిమా జెర్సీని ఈ వీకెండ్ లో విడుదల చేయడానికి సన్నద్ధమయ్యాం.
అయితే కోర్టులు మాకు అనుకూలమైన ఉత్తర్వు ఇచ్చే వరకు ముందుకు వెళ్లాలని అనుకోలేదు. బుధవారం విచారణ జరగనుంది. గురువారం విడుదలకు ప్లాన్ చేయడానికి సమయం లేదు కాబట్టి మేము అలాంటి ఆర్డర్ వచ్చే వరకు విడుదలను ఒక వారం అంటే ఏప్రిల్ 22కి వాయిదా వేయాలని నిర్ణయించుకున్నాము. ఈ రోజు మాకు అనుకూలమైన ఆర్డర్ వచ్చింది. ఇది వచ్చే వారం ఏప్రిల్ 22న మా విడుదలకు మార్గం సుగమం చేసింది...అని తెలిపారు.
అల్లు అరవింద్ సమర్పణలో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో దిల్ రాజు-ఎస్.నాగ వంశీ- అమన్ గిల్ నిర్మించిన జెర్సీ చిత్రం 22 ఏప్రిల్ 2022న విడుదల కానుంది. తెలుగులో విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ చిత్రం పలు భాషల్లో రీమేకవుతోంది. హిందీలో అత్యంత క్రేజీగా రిలీజ్ కి రెడీ అవుతోంది.