Begin typing your search above and press return to search.

కేంద్ర‌ ప్ర‌భుత్వ నిర్ణ‌యం స్వేచ్ఛను హ‌రించ‌డ‌మేః హీరోయిన్

By:  Tupaki Desk   |   27 March 2021 2:30 PM GMT
కేంద్ర‌ ప్ర‌భుత్వ నిర్ణ‌యం స్వేచ్ఛను హ‌రించ‌డ‌మేః హీరోయిన్
X
థియేట్రిక‌ల్ సినిమాల‌కు సెన్సార్ బోర్డు ఉన్న‌ట్టుగా.. ఓటీటీలో విడుద‌ల‌య్యే సినిమాలపై ఎలాంటి నియంత్ర‌ణా లేదు. దీంతో.. విశృంఖ‌ల‌త పెరిగిపోతోంద‌నే అభిప్రాయం కొంత‌కాలంగా వ్య‌క్త‌మ‌వుతున్న నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం విధాన నిర్ణ‌యాల‌ను రూపొందించింది.క‌ఠిన నిబంద‌న‌ల‌ను రూపొందించిన కేంద్రం.. ఆ రూల్స్ ను ప్ర‌తిఒక్కరూ పాటించాల‌ని ఆదేశాలు జారీచేసింది. ఈ నిర్ణ‌యంపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కొందు ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని స‌మ‌ర్థించ‌గా.. మ‌రికొంద‌రు వ్యతిరేకిస్తున్నారు.

తాజాగా.. న‌టి రాధికా ఆప్టే స్పందించారు. కేంద్రం తీసుకున్న నిర్ణ‌యం స‌మంజ‌సం కాద‌న్నారు. ఇది భావ‌ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ‌ను హ‌రించ‌డ‌మే అని అన్నారు. ఓటీటీకి ప్ర‌జ‌లు అల‌వాటు ప‌డ్డార‌ని, దానివ‌ల్ల స‌రికొత్త ఆలోచ‌న‌లు ప్రేక్ష‌కుల‌ను చేరుతున్నాయ‌ని అన్నారు. అంతేకాకుండా చాలా మందికి ఉపాధి కూడా ల‌భిస్తోంద‌ని అన్నారు ఆప్టే.ఓటీటీ చాలా అద్భుత‌మైన ప్లాట్ ఫాం అన్న రాధిక‌.. కేంద్రం రూపొందించిన నిబంధ‌న‌లు దారుణంగా ఉన్నాయ‌ని ఆక్షేపించింది. ఇప్పుడే ప‌రిస్థితి ఇలా ఉంటే.. రాబోయే రోజుల్లో ఇంకెన్ని మార్పులు వ‌స్తాయో చూడాల‌ని వ్యంగ్యంగా అన్నారు.