Begin typing your search above and press return to search.
అంతరిక్షంలో షూటింగ్ కు హీరోయిన్
By: Tupaki Desk | 6 Oct 2021 1:30 AM GMTఎన్నో సినిమాల్లో అంతరిక్షంకు సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరణ జరిగాయి. అయితే అవన్నీ కూడా గ్రాఫిక్స్ లేదా ప్రత్యేక సెట్టింగ్ ల్లో చేసినవే. ఇప్పటి వరకు సినిమాల్లో నిజమైన స్పేస్ సెంటర్ ను చూసిందే లేదు. అంతరిక్షంలో షూటింగ్ లు జరపడం సాధ్యమా అని ఇన్నాళ్లు అనుకున్నారు. కాని ఇప్పుడు అది సాధ్యం చేస్తున్నారు. నేడు రష్యాకు చెందిన ఒక అంతరిక్ష నౌక గగనతలంలోకి దూసుకు వెళ్లింది. ఆ అంతరిక్ష నౌక లో 'ది ఛాలెంజ్' అనే సినిమా షూటింగ్ కోసం దర్శకుడు క్లిమ్ షిపెంకో మరియు హీరోయిన్ యులియా పెరెసిల్డ్ ఇంకా ఇతర యూనిట్ సభ్యులు అంతరిక్షంకు వెళ్లారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం మద్యాహ్నం 2.25 గంటల ప్రాంతంలో వారి వ్యోమ నౌక బయలు జేరింది. 12 రోజుల పాటు చిత్ర యూనిట్ సభ్యులు అక్కడే ఉండబోతున్నారు.
వ్యోమ గాములు మరియు చిత్ర యూనిట్ సభ్యులు అంతా కలిసి అక్కడ షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. సినిమాలో ఒక వ్యోమగామి అంతరిక్షంలో అనారోగ్యం పాలవుతాడు. అతడికి చికిత్స అందించేందుకు గాను డాక్టర్ అక్కడకు వెళ్లాల్సి వస్తుంది. ఆ డాక్టర్ పాత్రను యులియా పోషిస్తుంది. గత ఏడాదిలో ఆ పాత్ర కోసం నిర్వహించిన ఆడిషన్స్ లో యులియా ఎంపిక అయ్యింది. ఆ పాత్ర కు సంబంధించిన మరింత ట్రైనింగ్ కోసం స్పేస్ సెంటర్ లో ట్రైనింగ్ కూడా తీసుకుంది. మొత్తానికి పెద్ద ఎత్తున ఈ సినిమా కోసం బ్యాక్ గ్రౌండ్ వర్క్ జరిగింది. అమెరికాకు చెందిన ఒక సినిమా యూనిట్ ముందుగా స్పేస్ సెంటర్ లో చిత్రీకరణ చేసేందుకు సిద్దం అవుతున్నట్లుగా ప్రకటించగా అంతకు ముందే రష్యాకు చెందిన ది ఛాలెంజ్ వారు స్పేస్ సెంటర్ కు వెళ్లారు.
అంతరిక్షంలో సినిమా షూటింగ్ తీయబోతున్న మొదటి దేశం రష్యాగా రికార్డుల్లో నమోదు కాబోతుంది. సినిమాలో అంతరిక్షంకు చెందిన సన్నివేశాలు 30 నుండి 40 నిమిషాల వరకు ఉంటుందట. అందుకు తగ్గట్లుగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకుని అక్కడకు వెళ్లారు. అక్కడ జరగాల్సిన షూట్ తాలూకు ప్రాక్టీస్ ను ఒకటికి పది సార్లు ఇక్కడ చేయడం జరిగిందట. అంతా అనుకున్నట్లుగా జరిగితే కేవలం పది రోజుల్లోనే చిత్రీకరణ ముగించే అవకాశాలు ఉన్నాయని.. అక్కడ మేకర్స్ కు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్పేస్ పైలెట్స్ కూడా ఉంటారని సమాచారం అందుతోంది. మొత్తానికి అంతరిక్షంలో అద్బుతంను ఆవిష్కరించేందుకు ది ఛాలెంజ్ సిద్దం అవ్వడం అందరిని ఆసక్తిగా ఎదురు చూసేలా చేస్తోంది. అంతరిక్షంలోకి మొదట హాలీవుడ్ హీరో టామ్ క్రూస్ వెళ్తాను అంటూ ప్రకటించాడు. కాని ఆయన కంటే ముందుగానే హీరోయిన్ యులియా వెళ్లడం తో ఆ రికార్డు ఆమెకు దక్కింది.