Begin typing your search above and press return to search.

'మేజ‌ర్' తెచ్చిన మార్పు..సౌత్ సైతం గులాం!

By:  Tupaki Desk   |   7 Jun 2022 11:30 PM GMT
మేజ‌ర్ తెచ్చిన మార్పు..సౌత్ సైతం గులాం!
X
దేశ భ‌క్తి నేప‌థ్యం గ‌ల సినిమాలంటే ఒక‌ప్పుడు కేవ‌లం బాలీవుడ్ కే ప‌రిమితం. ఉత్త‌రాది ప్రేక్ష‌కులు ఆ జోన‌ర్ సినిమాల‌కు ఎక్కువ‌గా క‌నెక్ట్ అవుతుంటారు. దేశ సైన్యంలో సేవ‌లందించ‌డంలో సైతం మెజార్టీ భాగం ఉత్త‌రాది యువ‌తే అధికంగా క‌నిపిస్తుంది. డిఫెన్స్ స‌ర్వీస్ లో ర్యాంకుల ప‌రంగానూ..ఉన్న‌త స్థానంలో నార్త్ పీపూల్స్ ఉండ‌టం స‌హా ఇలా ప్ర‌తీది ఉత్తరాదికి క‌నెక్టింగ్ గానే క‌నిపిస్తుంది.

పంజాబ్ లాంటి రాష్ర్టం నుంచి యువ‌త ఎక్కువ‌గా డిపెన్స్ స‌ర్వీస్ లో కొన‌సాగుతున్నారు. సైన్యంలో చేర‌డం అనేది అనాదిగా కొన‌సాగుతోన్న‌ ఆచారం లా రావ‌డంతో ఆ చుట్టు ప‌క్క‌ల రాష్ర్టాల‌పైనా ఆ ప్ర‌భావం తీవ్రంగా క‌నిపిస్తుంది. దేశ భ‌క్తిని న‌ర‌ర‌నాన జీర్ణించుకున్న యువత అధిక సంఖ్య‌లో క‌నిపిస్తుంది. సైన్యం నేప‌థ్యం గ‌ల సినిమాల ప్ర‌భావం అక్క‌డ యువ‌త పై ఉంటుంద‌ని ఓ స‌ర్వే సైతం చెబుతుంది.

అయితే ఉత్త‌రాదితో పోల్చుకుంటే ద‌క్షణాదిన ఆ ప్ర‌భావం అంతంగా క‌నిపించిందు. మొద‌టి వీటిపై అవ‌గాహ‌న లేక‌పోవ‌డం.. సౌక‌ర్యాలు స‌రిగ్గా లేక‌పోవ‌డం...స‌రైన గైడ‌న్స్ వంటివి లేక‌పోవ‌డం యువ‌త‌లో ఆర్మెడ్ ఫోర్సెస్ ప‌ట్ల‌ ఆశ స‌న్న‌గిల్ల‌డానికి ఓ కార‌ణంగా చెప్పొచ్చు. అయితే గ‌తంతో పోల్చుకుంటే ఇప్పుడు సౌత్ నుంచి కూడా మెరుగైన ఫ‌లితాలు సాధిస్తున్నారు.

ఆర్మెడ్ ఫోర్సెస్ ప‌ట్ల అవ‌గాహ‌న కూడా యువ‌త‌లో పెరిగింది. ఇటీవ‌ల రిలీజ్ అయిన 'మేజ‌ర్' యువ‌త‌లో మ‌రింత ఉత్సాహాన్ని నింపింద‌ని చెప్పొచ్చు. ముంబై తాజ్ హోట‌ల్ దాడుల్లో అమ‌రుడైన మేజ‌ర్ సందీప్ ఉన్ని కృష్ణ‌న్ జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కిన 'మేజ‌ర్' సినిమాకి ద‌క్షిణాది రాష్ర్టాల నుంచి అనూహ్యామైన రెస్పాన్స్ వ‌స్తుంది.

అందులోనూ తెలుగు రాష్ర్టాల్లో మేజ‌ర్ చిత్రాన్ని ఆద‌రిస్తున్న తీరు నిజంగా ప్ర‌శంస‌నీయం. జూన్ 3 న రిలీజ్ అయిన సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నా కేవ‌లం మ‌ల్టీప్లెక్స్ ల‌కు..ఓ సెక్ష‌న్ ఆడియ‌న్స్ కి మాత్ర‌మే ప‌రిమితం అవుతుంద‌ని కొంత మంది అంచ‌నాలు త‌ప్పు అయ్యాయి. ఏపీలో సింగిల్ స్ర్కీన్ థియేట‌ర్ సైతం స్టిల్ హౌస్ ఫుల్ ర‌న్నింగ్ లో ఉంది.

మారు మూల గ్రామాల్లో సైతం మేజ‌ర్ జై కొట్టిస్తున్నాడు. గ‌తంలో ఏ సినిమాకి రాని రెస్పాన్స్ మేజ‌ర్ చిత్రానికి రావ‌డం విశేషం. వాస్త‌వానికి ఆర్మీ బేస్ సినిమాలు సౌత్ లోనూ..అందులోనూ తెలుగులో ఇప్ప‌టి వ‌ర‌కూ రానేలేదు. ఫ్యాష‌న్ ఉన్న మేక‌ర్స్ సైతం క‌మ‌ర్శియ‌ల్ గా సినిమా వ‌ర్కౌట్ అవుతుందా? అన్న కోణంలో సాహ‌సించ లేక‌పోయారు.

కానీ శ‌షికిర‌ణ్ తిక్క మాత్రం ఓ గొప్ప వీరుడి క‌థ‌ని తెర‌పై ఆవిష్క‌రించిన విధానికి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. సందీప్ జీవింతంలో దాగిన ఎమోష‌న‌న్ ని తెర‌పైకి తీసుకు రావ‌డం... తాజ్ స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల కంట నీళ్లు తెప్పించాయి. తొలి షో అనంత‌రం ముగింపులో థియేట‌ర్ లో ప్రేక్షకులంతా జైహింద్ కొడుతూ..అమ‌ర్ ర‌హే సందీప్ అంటూ నివాళులు అర్పించ‌డం అన్న‌ది సినిమాకి ఏ స్థాయిలో కనెక్ట్ అయ్యారన్న‌ది అద్దం ప‌డుతుంది.

స్టిల్ ఇప్ప‌టివ‌ర‌కూ థియేట‌ర్ కి వెళ్లిన ప్రేక్ష‌కుడు అదే అనుభూతికి లోన‌వుతున్నాడు. యువ‌త సినిమాని ఎంతో రెస్ప‌క్ట్ చేయ‌డం స‌హా సందీప్ క‌థ‌ని తెలుసుకోవాల‌ని చేస్తోన్న ప్ర‌య‌త్నం మేజ‌ర్ తెచ్చిన మార్పుగా చెప్పొచ్చు. బ‌హుశా ఇవ‌న్నీ దృష్టిలో పెట్టుకునే రీల్ మేజ‌ర్ రియ‌ల్ మేజ‌ర్ల‌ని తయారు చేయ‌డం కోసం ఆర్మీలో చేరే వారికి ఉచితంగా అన్ని రకాల సౌక‌ర్యాలు క‌ల్పిస్తామ‌ని ప్రామిస్ చేసి ఉండొచ్చు.